ట్రంప్ కు దిమ్మ తిరిగేలా షాకిచ్చిన మోడీ
ఎవరేం అనుకున్నా సరే.. దేశ ప్రయోజనాల తర్వాతే మరింకేదైనా? ఎంత స్నేహితుడైతే మాత్రం.. సొంత ప్రజలకు నష్టం వాటిల్లేలా నిర్ణయం తీసుకోవటానికి ససేమిరా అనే ప్రధాని మోడీ.. తానేమిటో అందరికి తెలిసేలా చేశారు. ప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికా అధ్యక్షుడు స్వయంగా ఫోన్ చేసి సాయం అడిగితే.. ఒంటి మీద బట్టలు చించేసుకుంటూ నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వాలు భారత్ లో పోయి చాలాకాలమే అయ్యిందన్న విషయాన్ని అమెరికాకు అర్థమయ్యేలా చేశారు ప్రధాని మోడీ. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారటమే కాదు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నకు దిమ్మ తిరిగేలా షాకిచ్చింది.
రెండు రోజుల క్రితం హటాత్తుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. దేశ ప్రధాని మోడీకి ఫోన్ చేయటం తెలిసిందే. కరోనా మీద ఇరు దేశాలు కలిసి పని చేయాలని నిర్ణయించినట్లుగా ట్రంప్ వెల్లడించారు. అంతేకాదు.. భారత్ లో పెద్ద ఎత్తున ఉత్పత్తి అయ్యే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను తమకు ఇవ్వాలని ఆయన కోరారు. ఇందుకు మోడీ సమాధానం ఏమిటన్న విషయంపై క్లారిటీ రానప్పటికీ.. తాజాగా మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయం చూసినప్పుడు మాత్రం సాకింగ్ గా అనిపించకమానదు.
కరోనా వైద్యానికి కీలకమైన ఈ ఔషధాన్ని తమ దేశానికి పంపాలంటూ ట్రంప్ ఆశగా అడిగిన రోజునే అమెరికాకు దిమ్మ తిరిగేలా షాకిస్తూ.. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల ఎగుమతి.. ఫార్ములాకు సంబంధించిన నిబంధనల్నిమరింత కఠినం చేస్తూ.. అన్ని రకాల మినహాయింపుల్ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ డ్రేట్ తక్షణమే రద్దుచేసింది. వాస్తవానికి ఈ ఔషధ ఎగుమతిని మార్చి 25 నుంచే నిలిపివేశారు. తాజాగా ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఎగుమతి నిషేధం పరిధిలోకి రాని ఎగుమతి ఆధారిత యూనిట్లు.. ప్రత్యేక ఆర్థిక మండళ్లకు సైతం ఈ ఔషధాన్ని ఎగుమతి చేసే అంశంపై పరిమితులు విధించారు. దీంతో.. ఈ ఔషధం అమెరికాకు వెళ్లే అవకాశాల్ని పూర్తిగా మూసేశారు. ఓపక్క స్నేహపూర్వకంగా రిక్వెస్టు చేసినా.. దేశ ప్రయోజనాల కోసం మోడీ మాత్రం తన చేతలతో నో చెప్పేసిన తీరు ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పక తప్పదు.