• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మర్యాదలు చెప్పే కేసీఆర్.....

మర్యాదలు చెప్పే కేసీఆర్.. ప్రధాని మోడీతో భేటీలో పాల్గొనలేదే?

By - Tupaki Desk
Update: 2022-01-14 05:09 GMT
కోపం కస్సున కొట్టుకొచ్చిన వేళలో హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టేయటం.. తాను చెప్పాలనుకున్న మాటల్ని చెప్పేయటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటే. రాజకీయంగా ఎంత మాట అనేందుకైనా వెనుకాడని ఆయన.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తనపై ఎవరైనా ఘాటు విమర్శలు చేస్తే మాత్రం విరుచుకుపడతారు? ఇదేం పద్దతి.. ఆ మాత్రం గౌరవం కూడా ఉండదా? మర్యాద లేకపోతే ఎలా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నల్ని సంధిస్తారు.

ముఖ్యమంత్రిగా ఉన్న తాను రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నామని.. ప్రజలు ఎన్నుకున్నారని చెబుతూ.. తమ పార్టీకి వచ్చిన ఓట్లు.. సీట్ల లెక్కను గణాంకాలతో సహా వివరించటం తెలిసిందే. మరి.. ఇదే మర్యాద ముఖ్యమంత్రి కేసీఆర్ లో మిస్ అయితే ఎవరు ప్రశ్నించాలి? రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని గౌరవించటం మన విధి అని మాటలు చెప్పే సీఎం కేసీఆర్.. తాను చెప్పే మాటలు తనకు కూడా వర్తిస్తాయన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతారో?

తాజాగా కొవిడ్ మూడో వేవ్ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సులో  భేటీ అయ్యారు ప్రధానమంత్రి మోడీ. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డుమ్మా కొడితే.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం తరఫున రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. తెలంగాణను పట్టించుకోవాలని.. ప్రాధాన్యత ఇవ్వాలని..నిధులు కేటాయించాలని.. ప్రాజెక్టులను ప్రకటించాలంటూ తరచూ డిమాండ్లు చేసే కేసీఆర్ ఆయన కుమారుడు కేటీఆర్ లు.. దేశ ప్రధానిగా ఉన్న మోడీ ఒక కీలక అంశం మీద భేటీ నిర్వహిస్తే.. దానికి హాజరుకాకపోవటం దేనికి నిదర్శనం?

రాజకీయంగా సవాలచ్చ ఉండొచ్చు. కానీ.. పాలనా పరంగా ప్రోటోకాల్ పాటించాలి కదా? ఒకవైపు తన రాజకీయం తాను చేస్తూ.. చేతల్లో చూపిస్తూ.. మిగిలిన వారు మాత్రం బుద్దిగా తాను కోరింది మాత్రమే చేయాలని కోరుకోవటం అత్యాశే అవుతుంది కదా? ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ఉన్న తనకు మర్యాద.. గౌరవం ఇవ్వనోళ్లను బండ బూతులు తిట్టేసే సీఎం కేసీఆర్.. తాను సైతం ప్రజలు ఎదుర్కొన్న ప్రధాని మోడీని విమర్శిస్తానని.. తన కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ కాస్తంత ఘాటుగా రియాక్టు కావటం తెలిసిందే.

విమర్శలు చేయటం రాజకీయంలో భాగమని సర్ది చెప్పుకోవచ్చు. కానీ.. కీలక అంశాలకు సంబంధించిన సమీక్షా సమావేశానికి గైర్హాజరు కావటం విలువలు.. మర్యాదల గురించి మాట్లాడే కేసీఆర్ సబబేనా? అన్నది ప్రశ్న. జాతీయ స్థాయిలో మోడీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేయాలన్న తపనతో ఉన్న ఆయన.. ఆ ప్రయత్నం చేస్తూనే.. ప్రధాని కుర్చీలో కూర్చున్న మోడీకి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వాలన్న విషయాన్ని కేసీఆర్ ఎందుకు మిస్ అవుతున్నట్లు?
Tags:    
  • Kcr 
  • Kcr government 
  • Kcr comments 
  • Trs party 
  • Dalith bandhu 
  • modi 
  • central government 
  • political news 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS