పవన్‌ ఐ లవ్‌ యు.. కానీ

Update: 2019-03-23 16:08 GMT
ఫైర్‌ బ్రాండ్ పోసాని కృష్ణమురళి మరోసారి తన పంచ్‌ల వర్షం కురిపించారు. తెలంగాణ పాకిస్థాన్‌ అని పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని పోసాని తప్పుబట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో  ప్రెస్‌మీట్‌ పెట్టిన పోసాని.. గతంలో ఇదే పవన్‌కల్యాణ్‌ కేసీఆర్‌ని పొగిడారని గుర్తు చేశారు. కేవలం ఎన్నికల్లో భాగంగానే పవన్‌ కేసీఆర్‌ని విమర్శిస్తున్నారని.. కానీ విమర్శకు కూడా ఒక హద్దు ఉంటుంది గుర్తు చేశారు పోసాని.

పోసాని మాట్లాడుతూ.. “కేసీఆర్ ఇంటికి వెళ్లింది పపనే. ఆయన్ని స్పూర్తిగా తీసుకోవాలన్నది పవనే. కేటీఆర్‌ని వాటేసుకున్నది పవనే. కేటీఆర్ సోదరి కవితను నా బంగారు తల్లీ అన్నది పవనే. ఇప్పుడేమో.. జగన్‌ని తిడుతూ ఎందుకు కేసీఆర్‌ని భుజాన్‌ మోస్తున్నారో అర్థం కావడం లేదు. ఎందుకు తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నావ్. సరే మీరు చెప్పిందే నిజం అనినేను నమ్ముదాం. కేసీఆర్ ఆంధ్రవాళ్ల భూములు లాక్కుంటున్నారు అన్నావు. ఆయనఎక్కడ లాక్కున్నారు? ఎవర్ని బెదిరించారు? ఆంధ్రవాళ్లని కొడుతున్నారు.. చూస్తుంటే విసుగుపుడుతుంది అన్నావు. ఆంధ్రవాళ్లని తెలంగాణ వాళ్లు ఎప్పుడు కొట్టారు. ఎక్కడ కొట్టారు? కొడుతుంటే నువ్వు ఎంత మందిని అడ్డుకున్నావు.. ఇక్కడ చాలామంది ఆంధ్ర వాళ్లు ఉన్నారు అందరి ఇళ్లకు వెళ్దాం.. ఒక్కర్ని చూపించు ఎవరైనా కొట్టారని చెప్తే నీకు దండం పెడతా.  ఇవి అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు కాదు.. కాని చంద్రబాబు మాట్లాడిన మాటల్నే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు. ఆయన వలలో ఎందుకు పడ్డావు. ఎవడైనా చెగువేరాని ప్రేమించే వాడు చంద్రబాబుని ప్రేమిస్తారా? చెగువేరా ఉద్యమకారుడు.. చంద్రబాబు వెన్నుపోటుదారుడు ఎంత తేడా ఉంది. దీన్ని మేం ఎలా అర్ధం చేసుకోవాలి. నీ మాటలు విని.. తెలంగాణ వాళ్లు నిజంగా ఆంధ్రవాళ్లను కొడితే నువ్వు వస్తావా? నువ్వు రావు.. విజయవాడలో కూర్చుని స్టేట్ మెంట్లు ఇస్తావు” అంటూ పవన్ కళ్యాణ్‌పై ఓ రేంజ్‌లో విరుచుకు పడ్డారు పోసాని కృష్ణమురళి.
Tags:    

Similar News