• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పోలీస్ ఇంట్లో లెటర్...

పోలీస్ ఇంట్లో లెటర్ పెట్టి మరీ కన్నం ... !

By - Tupaki Desk
Update: 2021-07-07 08:43 GMT
ఇంట్లో ఎవరూ లేనిది చూసి డబ్బు, నగలను కొట్టేసినోళ్లను చాలామందిని ఉంటారు. విలువైన వస్త్రాలను దొంగతనం చేసినోళ్ల గురించి విని ఉంటారు. కోళ్లు, పెంపుడు శునకాలను అపహరించిన వాళ్ల కేసుల గురించి చదివి ఉంటారు. దొంగతనం చేసిన తర్వాత అక్కడి నుండి ఎవరూ చూడకముందే చిన్నగా జారుకుంటారు. కానీ, ఓ దొంగ కూడా అలానే దొంగతనం చేశాడు. కానీ, అలా చేసినందుకు క్షమాపణలు చెప్పాడు. అది కూడా ఓ పోలీసు ఇంట్లో కన్నం వేసి, భయం లేకుండా లెటర్ పెట్టి మరీ వెళ్లి పోయాడు.  ఇంట్లో డబ్బు, నగలను దోచుకెళ్లడమే కాకుండా, వెళ్లే ముందు ఓ లెటర్ పెట్టి వెళ్లిపోయాడు. అలాగే, తాను కావాలని దొంగతనం చేయలేదని, పరిస్థితుల కారణంగా చేయాల్సి వచ్చిందని, క్షమించాలంటూ లో లేఖ కూడా పెట్టడం గమనార్హం.

ఈ సంఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకోగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే ... మధ్యప్రదేశ్ లోని బిండ్ నగరానికి చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ కమలేష్ కఠారీ ఇటీవల, తన కుటుంబంతో కలిసి ఊరు వెళ్లాడు. తిరిగి వచ్చే సరికి, ఇంటి తలుపులన్నీ తెరచి ఉన్నాయి. ఇంట్లోని వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఆ పక్కనే ఓ లేఖ కూడా ఉంది. అందులో సారీ ఫ్రెండ్ నన్ను క్షమించండి. ఇదంతా పరిస్థితుల కారణంగా చేయాల్సి వచ్చింది. నా మిత్రుడి ప్రాణాలు కాపాడుకునేందుకు నేను ఈ దొంగతనం చేశాను. మళ్లీ నాకు డబ్బులు రాగానే మీ దగ్గర దోచుకుంది తిరిగి ఇచ్చేస్తానంటూ లేఖలో రాశాడు. కాగా, కమలేష్ కి తెలిసిన వారే ఈ దొంగతనం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ ఇంట్లోనే దొంగలు పడ్డంతో డిపార్ట్ మెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. క్లూస్ టీమ్ వచ్చి అన్ని రకాల ఆధారాలు సేకరించింది. వీలైనంత త్వరగా దొంగను పట్టుకుంటామంటున్నారు పోలీసులు. చెప్పడం కాదు, ఎలాగైనా పట్టుకోవాల్సిందే. 
Tags:    
  • police 
  • Madhya Pradesh 
  • Madhya Pradesh incident 
  • Bind City 
  • Assistant Sub Inspector Kamlesh Kathari 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS