మోడీ సాధించిన రికార్డు.. గురూ! మామూలుగా లేదుగా
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారీ రికార్డును నమోదు చేశారు. ప్రపంచదేశాల్లో ఇప్పటికే తన పేరును ఆయన రికార్డుస్థాయిలో వినిపిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మరో రికార్డును ఆయన సొంతం చేసుకున్నారు. అదేకరోనా వ్యాక్సిన్ పంపిణీ. కరోనా టీకా పంపిణీలో భారత్ ఆదివారం(జులై 17) మరో మైలురాయి సాధించింది. ఇప్పటివరకు 200 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసింది. ఈ ఘనతపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. భారత్ మరోసారి చరిత్ర సృష్టించిందని ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
. దేశ వ్యాక్సినేషన్ ప్రక్రియను అత్యంత నాణ్యంగా, వేగంగా నిర్వంచడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 2021 జనవరి 16న భారత్లో కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. దేశంలో 90 శాతం వయోజనులు టీకా రెండు డోసులు తీసుకున్నారు. దాదాపు 98 శాతం మంది.. కనీసం వ్యాక్సిన్ ఒక డోసు పొందారు.
15-18 ఏళ్ల వయస్కుల్లో.. 68 శాతం మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోగా.. 82 శాతం మంది కనీసం ఒక డోసు పొందారు. వీరికి వ్యాక్సిన్ పంపిణీ ఈ ఏడాది జనవరి 3న ప్రారంభమైంది. 12-14 ఏళ్ల వారిలో.. 56 శాతం మంది పూర్తిగా వ్యాక్సిన్ తీసుకోగా.. 81 శాతం మంది పిల్లలు కనీసం ఒక డోసు తీసుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, అండమాన్ అండ్ నికోబార్ దీవులు, జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, చండీగఢ్, తెలంగాణ, గోవా.. 12 ఏళ్ల పైబడినవారిలో 100 శాతం టీకా పంపిణీ చేసిన రాష్ట్రాలుగా నిలిచాయి.