మోడీ చేతుల మీద పట్టా తీసుకున్న బోడిగె ప్రదీప్ ప్రత్యేకత ఇదే!
హైదరాబాద్ మహానగర కీర్తికిరీటంలో ఒక భాగమైన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) స్నాతకోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కావటం తెలిసిందే. గ్రాడ్యుయేషన్ డేలో భాగంగా ఆయన చేతులు మీదుగా స్కాలర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ మెడల్ దక్కించుకున్న బొడిగె ప్రదీప్ కుమార్ మిగిలిన వారికి కాస్త భిన్నం. ఆ మాటకు వస్తే.. ప్రధాని మోడీ చేతుల మీదుగా పతకాలు.. పట్టాలు తీసుకున్న పలువురితో పోలిస్తే ఇతగాడు కాస్త స్పెషల్. ఎందుకంటే.. అతడి నేపథ్యం అలాంటిది మరి.
ఒక ప్రతిష్ఠాత్మక కళాశాలలో అత్యుత్తమ ప్రదర్శన చేయటం అంత సామాన్య విషయం కాదు. అందునా ఐఎస్ బీ అంటే అది మరో లెవల్. ఎందుకంటే.. దేశంలోని ప్రముఖ బీ స్కూల్స్ లో ఒకటిగా ఐఎస్ బీని చెప్పాలి. అలాంటి చోట చదవటమే కాదు.. తన ప్రతిభతో ఆయన సాధించిన పతకం ఒక ఎత్తు అయితే.. అతగాడి నేపథ్యం తెలిసిన తర్వాత ఆ పతకానికి ఉన్న విలువ మరింత పెరగటం ఖాయం. ప్రదీప్ మీద గౌరవం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే.. అతగాడు ఒక లారీ డ్రైవర్ కుమారుడు. పరిమిత వనరులతో ఇంతటి అద్భుతాన్ని సాధించాడు. తల్లి ఇంట్లోనే ఉండే పరిస్థితి.
అలాంటి పరిస్థితుల్లో తనకు తాను.. తానేం చేయాలనుకున్న దానికి సంబంధించిన అన్ని విషయాల్ని తనకు తానే చేసుకున్నాడని చెప్పాలి. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం.. మునగనూరు కు చెందిన ఇతడి సొంతూరుయాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజు పల్లి. ప్రస్తుతం హయత్ నగర్ మండలంలోని మునగనూరులో వారి కుటుంబం స్థిరపడింది. తండ్రి మల్లేశం లారీ డ్రైవర్ గా పని చేస్తున్నారు. తల్లి మంజుల ఇంట్లోనే ఉంటుంది. ఎన్ఐటీ నాగపూర్ లో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎల్ అండ్ టీలో పని చేసిన ప్రదీప్.. ఏడేళ్లుగా వివిధ హోదాల్లో పని చేశాడు.
చదివిన చదువు.. చేస్తున్న ఉద్యోగానికి పరిమితం కాకుండామరింత సాధించాలన్న కసితో.. గత ఏడాది మొహాలీ ఐఎస్ బీ క్యాంపస్ లో పీజీపీ కోర్సులో చేరారు. మొత్తంగా టాప్ త్రీలో ఒకడిగా నిలిచాడు. దీంతో స్కాలర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ మెడల్ దక్కటంతో పాటు.. దేశ ప్రధానమంత్రి చేతుల మీదుగా మెడల్ సాధించటం చూస్తే.. తగిన వ్యక్తికే మెడల్ దక్కిందన్న భావన కలుగక మానదు. ప్రదీప్ జీవితాన్ని చూసినప్పుడు అనిపించేదొక్కటే.. సవాళ్లు ఎదురైనప్పుడు వాటికి సమాధానం చెప్పాలన్న పట్టుదల.. లక్ష్యం నుంచి పక్కకు జరగకుండా శ్రమించటం.. లభించిన సక్సెస్ తో ఆగిపోకుండా ముందుకు ప్రయాణం చేస్తే మరిన్ని మైలురాళ్లను అధిగమించొచ్చన్న విషయం అర్థమవుతుంది. మరి.. ప్రదీప్ కు అందరం ఆల్ ద బెస్టు చెబుదామా?