అల్లూరి అంటే విశాఖ : భీమవరంలో ప్రధాని ల్యాండ్ అయితే ఎలా...?
అల్లూరి సీతారామ రాజు వంటి యోధుడు మళ్ళీ పుట్టడం అన్నది అసాధ్యం. ఆయన నాటి బ్రిటిష్ వారిని ఏకంగా నాలుగున్నరేళ్ల పాటు గడగడలాడించేశారు. అల్లూరి ఎంతటి మొనగాడు అంటే తాను ఫలానా టైమ్ కి ఫలానా ఊళ్ళో పోలీస్ స్టేషన్ కి వస్తున్నాను అని చెప్పి అక్కడ తూటాలను ఆయుధాలను తీసుకెళ్ళేవారు. అంతే కాదు తాను ఏమేమి ఆయుధాలు తీసుకున్నానో అదంతా ఒక లిస్ట్ రాసి తన సంతకం పెట్టి మరీ అక్కడ స్టేషన్ సిబ్బందికి ఇచ్చి మరీ దర్జాగా బయటకు వెళ్ళేవారు.
అల్లూరి ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసినా ఆయుధాలు తీసుకెళ్ళినా ఆయన్ని పట్టుకునే దమ్మూ ధైర్యం బ్రిటిష్ వారికి లేకపోయేది. ఇక విశాఖ ఏజెన్సీలో అల్లూరి తన పోరాటం అంతా చేసేవారు. ఆయన మన్యం జనాన్ని చైతన్యపరచి వారితోనే సమరం చేయించేవారు. ఆయన చింతపల్లి నుంచి మొదలుపెడితే దట్టమైన అడవులలో ఉంటూ తెల్ల దొరల మీద అలుపెరగని పోరు చేశారు.
ఇక అల్లూరి చరిత్ర చూస్తే ఆయన విశాఖ జిల్లా పాండ్రంకిలో పుట్టారు. పోరాటం అంతా విశాఖ ఏజెన్సీలో చేశారు. ఇక కొయ్యూరులో ఆయన తనువు చాలించారు. మరి అల్లూరి ఇరవై ఏడేళ్ళు బతికితే ఎక్కువ జీవితం కూడా విశాఖలోనే సాగింది. అటువంటి వీరుడి 125వ జయంతి వేడుకలు జూలై 4న వస్తున్నాయి. ఆ రోజు ఆయన పుట్టిన రోజు.
దాన్ని ఘనంగా చేయాలని చూస్తున్న బీజేపీ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని ఏపీకి రప్పిస్తోంది. అయితే మోడీ ల్యాండ్ అయ్యేది భీమవరంలో. అక్కడే ఆయన అల్లూరి 125వ జయంతి వేడుకలను నిర్వహిస్తారు. అయితే దీని మీద అల్లూరి అభిమానులు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అల్లూరి పుట్టింది పోరాటం చేసి వీరమరణం పొందినది అంతా విశాఖ జిల్లా కాబట్టి విశాఖలోనే అల్లూరి 125వ జయంతి వేడుకలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దీని మీద మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అల్లూరి వంటి మహావీరుడిని తప్పక గౌరవైంచాలని, ఆయన జయంత్రిని పది రోజుల పాటు ఘనంగా నిర్వహించాలని కోరారు. అలాగే అల్లూరి పుట్టిన గడ్డ అయిన విశాఖలో ప్రధాని అల్లూరి జయంతిని నిర్వహిస్తే అది గొప్ప నివాళి అవుతుంది అని సూచించారు. అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్ లో ఏర్పాటు చేయాలని, ఆయన ఫోటోతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుపీ నాణెన్ని రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అల్లూరి 125వ జయంతి ఉత్సవాలలో అన్ని రాజకీఅ పక్షాలను భాగస్వామ్యం చేయాలని కూడా కోరుతున్నారు.
ఇదిలా ఉంటే అల్లూరి జయంతి వేడుకలు భీమవరంలో ఎందుకు నిర్వహిస్తున్నారు అంటే క్షత్రియ సామాజికవర్గం పెద్ద ఎత్తున ఉండడం, వారిలో చాలా మంది బీజేపీ వైపు ఉండడంతో అక్కడ చేపట్టాలని నిర్ణయించారు అని అంటున్నారు. అయితే ఒక మహనీయుడిని స్మరించేటపుడు వివాదాలకు తావు లేకుండా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు.