• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  క్రికెట్ పిచ్ మీద ‘పింక్’...

క్రికెట్ పిచ్ మీద ‘పింక్’ ప్రకంపనలు

By - Tupaki Desk
Update: 2015-10-25 03:19 GMT
క్రికెట్ క్రీడా ప్రపంచంలో ఇప్పుడ పింక్ బాల్ వ్యవహారం పెద్ద రచ్చ చేస్తోంది. ప్రతిష్ఠాత్మక ఆసీస్.. న్యూజిలాండ్ సిరీస్ సందర్భంగా పింక్ బంతి వినియోగంపై మొదలైన వేడి రోజురోజుకీ మరింత పెరుగుతోంది. పింక్ బాల్ వినియోగంపై భిన్న వాదనలు వినిపించటమే దీనికి కారణం.

 నవంబరు 27 నుంచి డిసెంబర్ 1 వరకూ ఆడిలైట్ ఓవల్ లో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు ప్రత్యేకత ఏమిటంటే.. అంతర్జాతీయంగా డే అండ్ నైట్ టెస్ట్ లు జరిగినా.. అంతర్జాతీయంగా మాత్రం తొలి మ్యాచ్ జరగటం. తొలి అంతర్జాతీయ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ గురించి సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతుంటే.. ఈ మ్యాచ్ కు సంబంధించిన ఒక వివాదం రోజురోజుకీ ముదురుతోంది.

ఈ మ్యాచ్ లో పింక్ బంతిని వినియోగించాలని నిర్ణయించారు. అయితే.. ధీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పింక్ బంతి సరైన ఫలితం ఇవ్వటం లేదని ఆసీస్ ఆటగాడు ఆడమ్ వోజస్ తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించేశాడు. తన అసంతృప్తికి కారణం చెబుతూ.. 30 ఓవర్లకే పింక్ బాల్ మీద కోటింగ్ పోయి సరిగా కనిపించట్లేదని.. అలాంటప్పుడు రోజుకు 95 ఓవర్లు వరకు వేసే టెస్ట్ మ్యాచ్ లకు  పింక్ బంతి ఎలా వినియోగిస్తారని ప్రశ్నిస్తున్నారు.

పింక్ బంతి మొదట బాగానే ఉన్నా.. రానురాను ఆ బంతి మెత్తపడిపోతుందంటూ వోజస్ మరో ఉదాహరణ చెప్పుకొచ్చాడు. పింక్ బంతిని వినియోగించే ఆరంభ కార్యక్రమంలో ప్రైమ్ మినిస్టర్స్ బౌలర్ అస్టోన్ ఆగన్ వేసిన బంతిని న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గుప్తిల్ మిడ్ వికెట్ మీదుగా బంతిని కొడితే.. అది ఎటువైపు వెళ్లిందో కూడా తెలియదన్న ఆందోలన వ్యక్తం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో పింక్ బంతిని వినియోగించటం సరైందా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. మరి.. తొలి అంతర్జాతీయ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లో పింక్ వినియోగం మీదున్న అభ్యంతరాలపై తుది నిర్ణయం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    
  • Pink Ball 
  • Test Cricket 
  • Telugu News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS