భూ సేక‌ర‌ణ‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ థ్యాంక్స్‌

Update: 2015-08-28 15:31 GMT
ఏపీలో భూసేకరణకు వ్యతిరేకంగా గళం వినిపించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సీఎం చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని ప్రాంతంలో భూసేకరణ ఆపే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండడం చాలా సంతోషకరమని పవన్ ట్విట్టర్ లో తెలిపారు. రైతుల మనోభావాలను సానుకూలంగా అర్థం చేసుకున్నారంటూ సీఎం చంద్రబాబుకు ఆయన అభినందనలు కూడా తెలియజేశారు. అలాగే మంత్రులు పుల్లరావు, నారాయణతో పాటు ఇతర మంత్రులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

ఇటీవలే రాజధాని ప్రాంతంలో పర్యటించి భూసేకరణకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ ప్రసంగించిన సంగతి తెలిసిందే. రైతులకు అండగా ఉంటానని ఆయన హామీ కూడా ఇచ్చారు. బలవంతంగా భూములు లాక్కుంటే ధర్నాకు దిగుతానని కూడా పవన్ హెచ్చరించారు. దీంతో ఏపీ ప్ర‌భుత్వం ఒకింత న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు మొద‌లుపెట్టింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను సంప్ర‌దించిన త‌ర్వాతే రాజ‌ధాని భూముల విష‌యంలో ముందుకు వెళ‌తామంటూ ప్ర‌క‌ట‌న మంత్రులు ప్ర‌క‌ట‌న‌లు చేశారు. అదే క్ర‌మంలో మొద‌ట దూకుడ‌గా స్పందించిన మంత్రులు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, రావెల కిశోర్‌ బాబు వంటి వారు సైతం నెమ్మ‌దించారు. చంద్ర‌బాబు సైతం తాను అవ‌స‌ర‌మైతే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తో మాట్లాడుతాన‌ని ప్ర‌క‌టించారు. మొత్తంగా భూ సేక‌ర‌ణ అంశం నెమ్మ‌దించ‌డం.. ప‌వ‌న్ సానుకూలంగా స్పందించ‌డం హ‌ర్షించ‌ద‌గ్గ ప‌రిణామ‌మ‌ని భావిస్తున్నారు.
Tags:    

Similar News