• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పీకే సారు... పాచిపోయిన...

పీకే సారు... పాచిపోయిన లడ్డూలలోళ్ల దగ్గరెళతారట

By - Tupaki Desk
Update: 2019-08-30 14:30 GMT
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిపై ప్రస్తుతం కొనసాగుతున్న డైలమాపై జనసేనా పవన్ కల్యాణ్ తనదైన శైలి వ్యూహాన్ని బయటపెట్టారు. అమరావతిపై కొనసాగుతున్న గందరగోళాన్ని నివారించేందుకు ఆయన నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలను ఆశ్రయిస్తారట. ఈ మేరకు శుక్రవారం అమరావతికి భూములిచ్చిన రైతులు, అమరావతి ప్రాంత ప్రజలతో భేటీ అయిన పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై అటు టీడీపీ వైఖరితో పాటు ఇటు అధికార పార్టీ వైఖరిపైనా నిప్పులు చెరిగిన పవన్... ప్రజలకు క్లారిటీ తీసుకొచ్చేందుకు నేరుగా కేంద్రం వద్దకే వెళతానని ప్రకటించారు.

అమరావతి నిర్మాణానికి రైతుల నుంచి వేలాది ఎకరాల బంగారు భూములను లాక్కున్న టీడీపీ వైఖరి సరికాదని పేర్కొన్న పవన్... ప్రస్తుతం రాజధానిపై కన్ఫూజర్ క్రియేట్ చేస్తున్న వైసీపీ మంత్రుల వైఖరిపైనా నిప్పులు చెరిగారు. ఇకనైనా ఈ తరహా కన్ఫూజన్ రేకెత్తించే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని, లేదంటే తగిన రీతిలో బుద్ధి చెబుతానని కూడా పవన్ కల్యాణ్ వైసీపీ సర్కారుకు ఏకంగా వార్నింగులే ఇచ్చేశారు. సరే... అమరావతిపై కన్ఫూజన్ క్రియేట్ అయిన మాట వాస్తవమే గానీ... గతంలో అమరావతితో పాటు ఏపీకి విభజన హామీల మేరకు  ప్రత్యేక హోదా ఇవ్వని మోదీ సర్కారుపై కాకినాడ వేడికగా పవన్ తనదైన శైలి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిఃందే కదా. నాడు రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మోదీ సర్కారు చెప్పిన వైనాన్ని గుర్తు చేసిన పవన్... పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలంటూ తనదైన శైలిలో ఫైరైపోయారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని, పాచిపోయిన లడ్డూల మాదిరిగా ఉన్న ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా లేరని కూడా పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు అటు టీడీపీతో పాటు ఇటు వైసీపీకి కూడా విరోధిగానే మారిపోయిన పవన్... రాష్ట్రానికి ఏం కావాలన్నా అది కేంద్రం  చేతిలోనే ఉందన్న సత్యాన్ని గ్రహించినట్లుగా ఉన్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయన నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల వద్దకు వెళతానని సంచలన ప్రకటనలు చేశారు. అయినా పీకే ఢిల్లీ వెళ్లినా... ఆయనకు అటు మోదీ గానీ, ఇటు అమిత్ షా గానీ కనీసం అపాయింట్ మెంట్ అయినా ఇస్తారా? అన్న దిశగానూ ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది. మొత్తంగా కాస్త ఆలస్యంగానైనా రాజధాని అమరావతిపై పవన్ స్పందించారులే అన్న భావన వ్యక్తమవుతోంది.


Tags:    
  • Pawan Kalyan 
  • Amit Shah 
  • Modi 
  • Amaravati 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS