• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రాజధానిపై పవన్ పోరాటం...

రాజధానిపై పవన్ పోరాటం ముగిసినట్టే?

By - Tupaki Desk
Update: 2019-09-02 05:25 GMT
రాజధాని వ్యవహారం పెద్ద స్కామ్ లా ఉంది - ఒక రాజధాని వంద స్కామ్ లు అనే పరిస్థితి కనిపిస్తోంది. జనసేన అధిపతి పవన్ కల్యాణ్ వాటికి కూడా మద్దతు పలుకుతున్నారా? రాజధాని దోపిడీలో జనసేన కూడా పాలు  పంచుకుంటోందా?' అంటూ ఘాటుగా ప్రశ్నించారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధాని విషయంలో జనసేన అధిపతి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బొత్స స్పందించిన నేపథ్యంలో..దానిపై పవన్ కల్యాణ్ స్పందిస్తారా? అనేది ఆసక్తిదాయకంగా మారింది.

సాధారణంగా పవన్ కల్యాణ్ ఏ విషయంలో అయినా ఒకసారే స్పందిస్తారు. తనకు తోచింది ఏదో మాట్లాడి వెళ్లిపోతారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ అదే విషయం గురించి మాట్లాడిన దాఖలాలు వెదికినా కనపడవు. పవన్ కల్యాణ్ ఇది వరకూ అనేక అంశాల గురించి మాట్లాడారు. అనేక వ్యవహారాలపై ప్రకటనలు చేశారు. వాటికి పరిష్కారాలుగా తను పోరాడతా అన్నారు.

చేనేత కార్మికుల సమస్యలపై గతంలో స్పందిస్తూ వారిని ప్రధాని మోడీ వద్దకు తీసుకెళ్తానంటూ ప్రకటన చేశారు. ఆ తర్వాత ఊసు లేదు. ఇక ప్రత్యేకహోదా - కేంద్రంపై అవిశ్వాస తీర్మానం.. వంటి వ్యవహారాలు - అప్పట్లో చేసిన నిరాహార దీక్ష ప్రకటనలు గాలికిపోయాయి!

ఇదే తీరున రాజధానిపై కూడా పవన్ కల్యాణ్ పోరాటం ముగిసినట్టేనా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా భూముల సేకరణ సమయంలో పవన్ కల్యాణ్ రాజధాని ప్రాంతానికి వెళ్లి వచ్చారు. అప్పుడు కూడా జనాలు ఇచ్చిన క్యారేజ్ లు తిని… పవన్ కల్యాణ్ వారి మధ్యన కూర్చుని సినిమాలాంటి భావోద్వేగాలను పండించారు. ఆ తర్వాత మళ్లీ ఐదేళ్ల పాటు కూడా రాజధాని భూముల రైతుల గురించి పవన్ మాట్లాడిందే లేదు. ఏ వ్యవహారంలో అయినా ఒకసారి వెళ్లి రావడమే తన పని - అక్కడకు వెళ్లి బీరాలు పలికి వచ్చేస్తే తన పని అయిపోతుందన్నట్టుగా పవన్ వ్యవహారిస్తూ ఉంటారు.

ఈ రాజధాని పై పవన్ పోరాటం కూడా అదే బాపతే అని జనాలు గుసగుసలాడుతున్నారు. ఒకవేళ బొత్స సంధించిన ప్రశ్నలకు పవన్ ఇప్పుడు సమాధానాలు చెప్పకపోతే.. రాజధాని మాటున దాగి ఉన్న స్కాముల ఊసే ఎత్తకపోతే పవన్ ఆ వ్యవహారాన్ని పట్టించుకోవడం దాదాపు మానేసినట్టే అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు!
Tags:    
  • Pawan kalyan 
  • Andhra Capital 
  • Amaravathi 
  • Farmers 
  • Telugu News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS