• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కొత్త ర‌చ్చః ప‌వ‌న్...

కొత్త ర‌చ్చః ప‌వ‌న్ వ‌ర్సెస్ చింత‌మ‌నేని!

By - Tupaki Desk
Update: 2016-12-26 06:02 GMT
తెలుగుదేశం పార్టీ దెందులూరు ఎమ్మెల్యే - ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్ వివాదాల జాబితా పెరిగిపోతోంది. రెండ్రోజుల క్రితం జ‌ర్న‌లిస్టులతో వివాదాస్ప‌ద రీతిలో వ్య‌వ‌హ‌రించి ఏకంగా పాత్రికేయులు రోడ్డు ఎక్కే ప‌రిస్థితిని తీసుకువ‌చ్చిన చింత‌మ‌నేని తాజాగా జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ విష‌యంలో చేసిన కామెంట్లతో మ‌రో ర‌చ్చ సృష్టించారు. ఇటీవల చింతమనేని ఒక ఛానల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గ‌త ఎన్నిక‌ల్లో పవన్‌ కల్యాణ్ ప్రచారం త‌మ పార్టీకి, తన గెలుపునకు ఏమీ ఉపయోగపడలేదని తేల్చేశారు. ఆయ‌న వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్‌ తో ప‌వ‌న్ ఫ్యాన్స్ భ‌గ్గుమ‌న్నారు. చింత‌మ‌నేని ప్ర‌భాకర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ పవన్‌, మెగా అభిమానులు పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం - తాడేపల్లిగూడెం పట్టణాల్లో ఆందోళనలు నిర్వహించారు.

తాడేపల్లిగూడెంలో జనసేన కార్యకర్తలు చింతమనేని ఫ్లెక్సీని దగ్ధం చేశారు. పవన్‌ కళ్యాణ్‌ పై చేసిన విమర్శలు ఉపసంహరించుకోవాలని జంగారెడ్డిగూడెం బస్టాండు నుంచి బోసు బొమ్మ సెంటరు వరకూ ప్రదర్శన నిర్వహించి, అక్కడ ధర్నా చేశారు. అనంతరం పవన్‌ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాలకు మెగా ఫ్యామిలీ అభిమానులు పెద్ద సంఖ్య‌లోనే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చింతమనేని తీరు ఓడ దాటిన త‌ర్వాత బోడ మ‌ల్ల‌న్న రీతిలో ఉంద‌ని వ్యాఖ్యానించారు. చింత‌మ‌నేనికి అంత‌గా సొంత ద‌మ్ము ఉంటే ఇపుడు రాజీనామా చేసి ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ స‌వాల్ విసిరారు. ప్ర‌జాప్ర‌తినిధిగా ఉన్న‌ప్ప‌టికీ చింత‌మ‌నేని చెల‌రేగి పోతుంటే....ఆయ‌న పార్టీ అధిష్టానం ఏ విధంగా చూస్తూ ఉంద‌ని ప‌వ‌న్ అభిమానులు ప్ర‌శ్నించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Pawan Kalyan Fans 
  • Chintamaneni Prabhakar 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS