• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమరావతిపై మోడీషాలను...

అమరావతిపై మోడీషాలను కలుస్తా: పవన్

By - Tupaki Desk
Update: 2019-08-30 06:01 GMT
రాజధాని అమరావతిపై మంత్రులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం సరికాదని.. మంత్రులు సంయమనం పాటించాలని జనసేనాని పవన్ కళ్యాన్ సూచించారు. రాజధానిపై మంత్రుల మాటలతో ఇంత గందరగోళం నెలకొందని.. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత  సీఎం జగన్ పై ఉందని పవన్ సూచించారు. ఇప్పటికైనా ప్రభుత్వంలో చలనం రాకపోతే ప్రధాని నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుస్తానని పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.

అమరావతి రాజధాని మార్పుపై వస్తున్న ఊహాగానాల నేపథ్యం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం నిడమర్రు - కురగల్లు - ఐనవోలు - అనంతవరం - దొండపాడు తదితర అమరావతికి రైతులు భూములు ఇచ్చిన గ్రామాల్లో  పర్యటించారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వారినుంచి వినతిపత్రాలు స్వీకరించారు.  తమను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని రాజధాని నిర్వాసిత రైతులు పవన్ కు మొరపెట్టుకున్నారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రాజధానిపై మంత్రులు ఇష్టం వచ్చినట్టు ప్రకటనలు చేయడంతో తాము ఇబ్బందుల పాలవుతున్నామని తెలిపారు. గ్రామాల్లో తాగునీటి వసతులు లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అమరావతి రాజధాని తరలిపోతున్నట్టు వస్తున్న వార్తలపై గందరగోళానికి గురవుతున్నట్టు పవన్ కు మొరపెట్టుకున్నారు.

ఇక రైతుల సమస్యలను సావధానంగా విన్న పవన్ కళ్యాణ్ ఆందోళన చెందవద్దని.. రైతుల పక్షాన తాను ఉంటానని హామీ ఇచ్చారు.. రైతుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. రాజధానిపై మంత్రులు సంయమనం పాటించాలని సూచించారు. బొత్స ఆరోపించినట్టు తాను అమరావతిలో రాజధాని వద్దని ఏనాడు చెప్పలేదని.. రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవద్దని మాత్రమే చెప్పానని గుర్తు చేశారు. ఇప్పటికే రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయామని.. ఇప్పుడు ఇలాంటి గందరగోళ నిర్ణయాలతో మరింత నష్టం చేకూరుతుందని అన్నారు.

సీఎం జగన్, మంత్రులు ఇలాంటి గందరగోళ నిర్ణయాలు తీసుకొని నష్టం చేస్తామంటే తాను బలమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఈ తీరు మారకుండా ఢిల్లీ వెళ్లి తేల్చుకుంటానని రాష్ట్రంలోని సమస్యలు - పరిస్థితులను మోడీషాలకు వారికి వివరిస్తానని స్పష్టం చేశారు.


Tags:    
  • Pawan kalyan 
  • jagan 
  • Amaravathi 
  • Telugu News 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS