• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  గిల్గిట్-బాల్టిస్తాన్‌‌...

గిల్గిట్-బాల్టిస్తాన్‌‌ ఆక్రమణకు పాక్ ప్లాన్

By - Tupaki Desk
Update: 2020-09-17 17:34 GMT
భారత్ తో కయ్యానికి కాలు దువ్వే పాకిస్థాన్....అందుకు వచ్చే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోదు. సరిహద్దులో కవ్వింపు చర్యలకు దిగడం మొదలు....చైనాతో కలిసి భారత్ పై కుట్రలు పన్నడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతూ పైశాచికానందం పొందుతుంటుంది. ఓ పక్క చైనాతో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగక ముందే దాయాది దేశం మరో కుట్రకు తెరలేపింది. గిల్గిట్-బాల్టిస్తాన్‌ను అధికారికంగా తమ దేశంలో విలీనం చేసుకునేందుకు పాక్ స్కెచ్ వేసింది. పాక్ లో మేము కలవం మొర్రో అని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రజలు మొత్తుకుంటున్నా పాక్ వినకుండా నియంతపోకడతో వ్యవహరిస్తోంది. గిల్గిట్‌కు పూర్తి స్థాయి ప్రావిన్స్ హోదా ఇచ్చి సెనేట్‌, నేషనల్ అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం కల్పించి ఆ ప్రాంతంపై పెత్తనం చలాయించేందుకు పాక్ సిద్ధమైంది.

గిల్గిట్ బాల్టిస్తాన్‌కు రాజ్యాంగబద్దమైన హక్కులతో పూర్తి స్థాయి ప్రావిన్స్‌గా మార్చేందుకు పాక్ ప్రభుత్వం నిర్ణయించినట్లు కశ్మీర్-గిల్గిట్ బాల్టిస్తాన్ వ్యవహారాల మంత్రి అలీ అమీన్ గందపూర్ వెల్లడించడంతో ఈ చర్చకు తెరలేచింది. త్వరలోనే ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గిల్గిట్ బాల్టిస్తాన్‌ను సందర్శించి ఈవిషయంపై అధికారిక ప్రకటన చేస్తారని ఆయన తెలిపారు.భారత్-పాక్ మధ్య వివాదంలో ఉన్న గిల్గిట్ బాల్టిస్తాన్‌ను హస్తగతం చేసుకునేందుకు 2018లో పాక్ అక్కడ ఎన్నికలకు కూడా సిద్దమైంది. 2020 నవంబర్‌లో ఎలక్షన్ జరిపేందుకు పాక్ సర్కార్ రెడీ అవుతోంది. గిల్గిట్-బాల్టిస్తాన్ భారత భూభాగంలో అంతర్భాగమని భారత్ వాదిస్తోంది. దానిపై పాక్ కు హక్కు లేదని చెబుతోంది. గిల్గిట్-బాల్టిస్తాన్‌లో ఎన్నికల నిర్వహణకు పాక్ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును భారత్ ఖండించింది.
Tags:    
  • Pakistan 
  • Gilgit Baltistan 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS