చెప్పుల్లో బ్లూ టూత్ పెట్టుకొని అడ్డంగా బుక్ అయ్యారు
హైటెక్ కాపీయింగ్ ఉదంతం ఒకటి తాజాగా బయటకు వచ్చింది. ఇలా కూడా కాపీ చేయొచ్చా? అన్నట్లుగా ఉన్న వ్యవహారం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఉపాధ్యాయుల ఎంపికకు నిర్వహించిన అర్హత పరీక్షలో హైటెక్ కాపీయింగ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు ఎవరూ ట్రై చేయని రీతిలో సరికొత్తగా ప్లాన్ చేసినప్పటికీ అడ్డంగా బుక్ కావటం గమనార్హం. ఈ ఉదంతంలో ఇప్పటివరకుపోలీసులు ఐదుగురును అరెస్టు చేశారు.
రాజస్థాన్ లో పెను సంచలనంగా మారిన ఈ అర్హత పరీక్షలో బ్లూ టూత్ అమర్చిన చెప్పులతో హైటెక్ రీతిలో పరీక్షల్లో కాపీ కొట్టే ప్రయత్నం చేశారు. ఇందుకు కాను.. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.6లక్షలు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటకు రావటంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన అర్హత పరీక్షల వేళ.. పరీక్షా కేంద్రాల వద్ద మొబైల్.. ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు.
ఈ పరీక్షను16.51 లక్షల మంది అభ్యర్థులు రాయగా.. చెప్పుల మధ్య భాగంలో బ్లూటూత్ ను అమర్చి.. దాని ద్వారా సమాధానాలుఎప్పటికప్పుడు తెలుసుకుంటూ కాపీ కొట్టే ప్రయత్నం చేయగా.. పరీక్షా కేంద్రాల్లో వారంతా దొరికిపోయారు. ఇదిలా ఉంటే.. దౌసా.. జైపూర్ రూరల్ ప్రాంతాల్లో ఎనిమిది మంది డమ్మీఅభ్యర్థుల్ని పోలీసులు అరెస్టు చేశారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవకతవకలకు ప్రయత్నించగా.. వారందరిని గుట్టును రట్టు చేయటంలో అధికారులు సక్సెస్ అయ్యారు. చెప్పుల్లో బ్లూ టూత్ అమర్చి కాపీ చేసే తీరు మాత్రం అందరిని విస్మయానికి గురి చేస్తోంది.