• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బీ అలెర్టు భారత్.....

బీ అలెర్టు భారత్.. ఒమిక్రాన్ భారీగా తాకేదెప్పుడో చెబుతున్నారు

By - Tupaki Desk
Update: 2021-12-21 12:11 GMT
కరోనా కథ పూర్తి కాలేదు. కొద్ది నెలల వరకు కరోనా.. దాని వేరియంట్ల మీద అవగాహన తక్కువగా ఉండేది. ఎప్పుడైతే డెల్టా వేరియంట్ సెకండ్ వేవ్ రూపంలో విరుచుకుపడటం.. ఆ సందర్భంగా చోటు చేసుకున్న దారుణ పరిస్థితుల దెబ్బకు.. కరోనా.. దాని తీవ్రతతో పాటు.. అదెంతటి విలయాన్ని క్రియేట్ చేస్తుందన్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. డెల్టా వేరియంట్ దాడి తగ్గి.. మామూలు పరిస్థితులు నెలకొంటున్నాయన్న వేళ.. ఒమిక్రాన్ వేరియంట్ వ్యవహారం బయటకు వచ్చింది. దక్షిణాఫ్రికాలో మొదలైన ఈ వేరియంట్.. డెల్టా.. డెల్టా ప్లస్ వేరియంట్ కంటే వేగంగా విస్తరిస్తుందన్న హెచ్చరికల్ని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీనికి తగ్గట్లే.. దాని విస్తరణ అమితమైన వేగంతో సాగుతోంది. చూస్తుండగానే దాదాపు 90 దేశాల్లో ఒమిక్రాన్ తీవ్రత సాగుతోంది. అయితే.. దీని కారణంగా మరణాలు తక్కువగా ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నప్పటికి.. పలు దేశాలు ఈ కొత్త వేరియంట్ కు వణికిపోతున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురి చేసే ఈ కొత్త వేరియంట్ తీవ్రత భారత్ ను తాకే సమయం ఎప్పుడన్న విషయంపై తాజాగా ఒక లెక్కను నిపుణులు వివరిస్తున్నారు.

వారి అధ్యయనం ప్రకారం ఒమిక్రాన్ కేసుల సంఖ్య భారత్ లో గణనీయంగా పెరుగుతాయని.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మూడో వేవ్ తాకే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికి దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 200 వరకు నమోదయ్యాయి. డెల్టా ప్లస్ కంటే కూడా ఒమిక్రాన్ వేరియంట్ 70 రెట్లు వేగంగా విస్తరిస్తుందని చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక నివేదికను యూనివర్సిటీ ఆఫ్ హాంగ్ కాంగ్ వెల్లడించింది.

ఈ వేరియంట్ మనిషి రోగ నిరోధక వ్యవస్థ మీద దాడి చేస్తుందని.. రానున్న కాలంలో మరిన్ని వేరియంట్లు పుట్టే అవకాశం ఉందంటున్నారు.  ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసుల్లో గొంతు నొప్పి.. అలసట లాంటి తేలిక లక్షణాలే బయటకు వచ్చాయి. ఒకవేళ.. డెల్టా ప్లస్.. ఒమిక్రాన్ వేరియంట్లు మ్యూటేట్ అయితే మాత్రం చాలా కష్టమని.. దారుణమైన పరిస్థితులు ఎదురవుతాయన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటివరకు ఒమిక్రాన్ బారిన పడిన వారు.. ఇంట్లోనే కోలుకుంటున్నారు. అయినప్పటికీ.. దీని తీవ్రత గురించి అవగాహన ఉన్న వారు మాత్రం ఒమిక్రాన్ మాట వింటేనే.. పక్కనే బాంబు పడినంత ఆందోళనకు గురవుతున్నారు. సో.. మరో రెండు నెలల్లో దేశంలో ఒమిక్రాన్ తీవ్ర రూపం దాలుస్తుందన్న అంచనాల నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    
  • Omicron 
  • Covid19 
  • atest News 
  • Telugu News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS