లోకేష్ ను - పవన్ కళ్యాణ్ ను ఓడించిన ఎమ్మెల్యేలు ఏమయ్యారు?

Update: 2020-08-13 07:30 GMT
‘‘లోకేష్.. భావి టీడీపీ వారసుడు..’’....  ‘‘పవన్ కళ్యాణ్.. జనసేనాని..’’  ఈ ఇద్దరు రాబోయే ఏపీకి.. కాబోయే సీఎంలుగా వారి పార్టీల్లోని నేతలు ఊహించుకుంటున్నారు. అయితే ఈ ఇద్దరు దిగ్గజాలను ఓడించిన  వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రం కనీసం అపాయింట్ మెంట్ కూడా కరువైందన్న చర్చ వైసీపీలో వ్యక్తమవుతోంది. సీఎం జగన్ హామీనిచ్చినా ఎలాంటి పదవులు లేక కనీసం ముఖం కూడా చూపించుకోలేని పరిస్థితుల్లో సదురు ఎమ్మెల్యేలున్నారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

లోకేష్ ను గట్టి మెజారిటీతో ఓడించిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణరెడ్డి ఈరోజు అమరావతి రాజధాని ప్రాంతంలో తిరిగే పరిస్థితి లేదు. అలాగని సీఎం జగన్ స్వయంగా హామీ ఇచ్చినా ఆళ్లకు మంత్రి పదవి రాలేదు. కుల సమీకరణాల్లో గల్లంతైంది. దీంతో ఈ మధ్య వాళ్ల అన్నకు రాజ్యసభ ఎంపీ ఇచ్చి ఓదార్చారు.

నారా లోకేష్ ను ఓడించిన ఆళ్లకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తానని జగనే స్వయంగా ఎన్నికల వేళ ప్రకటించారు. ఆళ్లను గెలిపిస్తే మంత్రి అవుతాడని.. అక్కడి వాళ్లు ఓట్లు వేసి పట్టం కట్టారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అని అర్థమవుతోంది.
 
అలాగే పవన్ కళ్యాణ్  రెండు చోట్ల పోటిచేస్తే ఆ రెండు చోట్లా ఓడించిన ఇద్దరు ఎమ్మెల్యేలకు కనీసం వైసీపీ అధిష్టానం అపాయింట్ మెంట్ కూడా లేదు అని వాళ్ల నియోజకవర్గంలో అనుకుంటున్నారు. గ్రంథి శ్రీనివాస్ కు కుల సమీకరణాల్లో ఆ జిల్లాలో మంత్రి పదవి సహా వేరే పదవులు వచ్చే పరిస్థితి లేదట.. ఇక గాజువాకలో పవన్ ను ఓడించిన తిప్పల నాగిరెడ్డి పేరునే వైసీపీ అధిష్టానం మరిచిపోయిన పరిస్థితి నెలకొంది.  

ఇలా  టీడీపీ కాబోయే సీఎంగా చెప్పుకున్న లోకేష్ ను ఓడించిన ఆ వైసీపీ ఎమ్మెల్యేకు ఏం న్యాయం జరగలేదని.. ఇక బలమైన జనసేనాని పవన్ కళ్యాణ్ ను ఓడించిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలకు ఏమీ దక్కలేదని వాళ్లంతా వాపోతున్నారట.. దిగ్గజాలను ఓడించిన వారికే దిక్కు లేదు.. ఇక సాధారణ వైసీపీ ఎమ్మెల్యేలకు ఏమీ వస్తుందని వారంతా చెవులు కొరుక్కుంటున్నారట..  
 


Tags:    

Similar News