మన్మోహన్ సింగ్.. ఒక మాజీయేనా? కాంగ్రెస్ కు మార్గం లేదు!

Update: 2019-06-15 07:25 GMT
దశాబ్దాల నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికవుతూ వచ్చిన మాజీ ప్రధానమంత్రి, విఖ్యాత ఆర్థిక వేత్త మన్మోహన్ సింగ్ ఇక మాజీగా మిగిలిపోవాల్సిన  పరిస్థితి వచ్చినట్టుంది. ఆరేళ్ల కిందట మరోసారి రాజ్యసభ కు ఎన్నికయ్యారు మన్మోహన్. అప్పట్లో ప్రధానమంత్రి హోదాలో ఉన్న ఆయనను అస్సోం నుంచి నామినేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ.

ఇప్పుడు ఆ పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఆయనకు మరో అవకాశం ఉంటుందా? అంటే కష్టమే అని చెప్పాలి. అస్సోంలో ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి మన్మోహన్ సింగ్ ను మరోసారి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలు లేవు.

ఆయనను ఎలాగోలా రాజ్యసభకు పంపాలనే కాంగ్రెస్ కోరుకుంటోంది. అలాంటి సౌమ్యుడు, అందరి యాక్సెప్టెన్స్ ఉన్న వ్యక్తి ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యసభలో కాంగ్రెస్ కు అవసరం ఉంది. వేరే రాష్ట్రాల నుంచి అయితే కాంగ్రెస్ పార్టీ ఆయనను రాజ్యసభకు పంపగలదు. అయితే ఆ రాష్ట్రాల కోటాలో ఇప్పుడు ఖాళీలు ఏవీ లేవు.

ఇప్పుడు వివిధ రాష్ట్రాల కోటాలో రాజ్యసభ సీట్లు భర్తీ అవుతుండగా కాంగ్రెస్ కు అక్కడ మాత్రం బలం లేదు. దీంతో మన్మోహన్ సింగ్ ఒక మాజీ ప్రధానిగానే కాకుండా మాజీ ఎంపీగా, మాజీ రాజ్యసభ సభ్యుడిగా మిగిలిపోవాల్సిన పరిస్థితి వచ్చినట్టుందని విశ్లేషకులు అంటున్నారు.
Tags:    

Similar News