• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  హుజూరాబాద్ ఉప ఎన్నికలో...

హుజూరాబాద్ ఉప ఎన్నికలో నిజామాబాద్ సీన్ రిపీట్?

By - Tupaki Desk
Update: 2021-07-22 05:43 GMT
2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  నిజామాబాద్ లోక్ సభ స్థానానికి జరిగిన ఎన్నికలు దేశ వ్యాప్తంగా అందరిని ఆకర్షించాయి. దీనికి కారణం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఎన్నికల బరిలో నిలవటం ఒకటైతే.. ఆమెకు షాకిచ్చేందుకు వీలుగా తమ దీర్ఘకాలిక డిమాండ్ అయిన పసుపు బోర్డును ఏర్పాటుపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిరసనగా.. 175 మంది రైతులు ఎన్నికల బరిలో నిలవటం తెలిసిందే. రైతులు సమిష్ఠిగా తీసుకున్న నిర్ణయం కవిత ఓటమికి కారణమైందన్నది మర్చిపోకూడదు.

తెలంగాణలో తిరుగులేని అధికారం ఉందని చెప్పకునే కేసీఆర్.. తన కూతుర్ని గెలిపించుకోలేకపోయారన్న విమర్శ పెద్ద ఎత్తున వచ్చింది. కవిత ఓటమి తెలంగాణ అధికారపక్షాన్ని తీవ్ర ఒత్తిడికి గురి చేయటమే కాదు.. వారంతా ఆత్మరక్షణలో పడేసేలా చేసింది. తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో అనివార్యంగా మారిన హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి సంచలన ప్రకటన ఒకటి తెర మీదకు వచ్చింది. బీసీ వర్గాల హక్కుల కోసం కోట్లాడే ఆర్ క్రిష్ణయ్య తాజాగా చేసిన ఒక ప్రకటన తెలంగాణ అధికార పక్షం ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది.

ఎందుకంటే.. బీసీలకు చెందిన వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లు హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో దిగుతారంటూ సంచలన ప్రకటన చేశారు. ప్రభుత్వం అన్యాయంగా తొలగించిన 7600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు మళ్లీఉద్యోగాల్ని ఇవ్వని పక్షంలో తాము సైతం ఎన్నికల బరిలో నిలుస్తారని చెబుతున్నారు. అంతేకాదు.. వందలాదిగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు. ప్రభుత్వం అక్రమంగా తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లును వెంటనే ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆయన అల్టిమేటం ఇచ్చారు.

హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో వెలువడే ఫలితం 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొన్నారు. ఊహించని రీతిలో తెర మీదకు వచ్చిన ఈ డిమాండ్ పై కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరమని చెప్పక తప్పదు. అయితే.. ఆర్ క్రిష్ణయ్య పేర్కొన్నట్లుగా వెయ్యి మంది బరిలోకి దిగే అవకాశం ఉందా? అన్నదిప్పుడు చర్చగా మారింది. నిజానికి పసుపు రైతులు సైతం వెయ్యి మంది ఎన్నికల బరిలో నిలవాలని ప్లానింగ్ చేసినప్పటికి.. ప్రాక్టికల్ ఇష్యూస్ తో 175 మందే ఎన్నికల బరిలో దిగారు. మరి.. హూజూరాబాద్ లో నిజామాబాద్ సీన్ రిపీట్ అవుతుందా? లేదా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    
  • Huzurabad 
  • Political News 
  • Breaking News 
  • Latest News 
  • bypolls 
  • etela rajender 
  • kcr 
  • revanth reddy 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS