• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నీతా అంబానీ...

నీతా అంబానీ అదరగొట్టేసింది

By - Tupaki Desk
Update: 2016-08-04 17:19 GMT
నీతా అంబానీ అరుదైన రికార్డును సృష్టించారు. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణిగా కాకుండా తనదైన శైలిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించే ఆమె.. ఇప్పటివరకూ ఏ భారతీయ మహిళకు దక్కని అరుదైన గౌరవం లభించింది. ఒలింపిక్ కమిటీలో తొలి భారతీయ మహిళా సభ్యురాలిగా ఎంపికైన ఆమె చరిత్రనే సృష్టించారు.

తాజాగా జరిగిన ఐవోసీ 129వ సమావేశంలో రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్.. ఛైర్ పర్సన్ అయిన నీతా అంబానీని ఒలింపిక్ కమిటీ సభ్యురాలిగా ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒలింపిక్ అజెండా 2020 ఆధారంగా కొత్త సభ్యుల ఎంపికను చేపట్టారు. క్రీడల్ని పోత్సహించటం.. పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్ని చేపట్టిన నీతా అంబానీ ఇటీవలే.. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. దీంతో ఆమెకు ఐవోసీలో స్థానం కోసం నామినేట్ అయ్యారు.

తనకు లభించిన అరుదైన గుర్తింపు మీద నీతా అంబానీ తాజాగా స్పందించారు. తనకు దక్కిన గౌరవం భారతీయ మహిళకు అంతర్జాతీయంగా లభించిన గుర్తింపుగా అభివర్ణించిన ఆమె.. దేశీయంగా క్రీడాకారులకు తాను అండగా నిలుస్తానని చెప్పారు. ఇప్పటివరకూ భారత్ నుంచి ఐవోసీ కమిటీలో సభ్యులుగా దొరాబ్జీ టాటా.. రాజా రణ్ ధీర్ సింగ్ లకు మాత్రమే ఐవోసీలో స్థానం లభించింది. టాటాను ఐవోసీలో సభ్యుడిగా ఎంపిక కాగా.. రణ్ దీర్ సింగ్ అంతర్జాతీయ కమిటీలో గౌరవ సభ్యుడిగా ఎన్నికయ్యారు.  భారతీయ మహిళకు కమిటీలో చోటు లభించటం నీతా అంబానీతోనే మొదలైంది. కంగ్రాట్స్ నీతా.
Tags:    
  • Nita Ambani 
  • first Indian woman member 
  • IOC 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS