బాణాసంచా విక్రయాలపై ఎన్జీటీ కీలక నిర్ణయం!

Update: 2020-11-09 13:30 GMT
అతి త్వరలో దీపావళి పండుగ రాబోతుంది. అయితే , ఇంకా కరోనా వైరస్ తీవ్రత దేశంలో ఏ మాత్రం తగ్గడంలేదు. ప్రతిరోజూ కూడా భారీగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీపావళి పర్వదినం సందర్భంగా  ఢిల్లీ సహా కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో టపాసుల కాల్చడం, అమ్మకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. నవంబరు 30 వరకు బాణా సంచా విక్రయాలు, కాల్చడంపై నిషేధం విధిస్తున్నట్టు ఎన్‌ జీటీ తెలిపింది. ఈ అర్ధరాత్రి నుంచే ఈ రూల్స్  అమల్లోకి రానున్నాయి. క్రిస్‌ మస్ సహా న్యూఇయర్ రోజుల్లో మధ్యాహ్నం 12 నుంచి 2.00 గంటల మధ్య మాత్రమే  బాణా సంచా కాల్చడానికి  అనుమతిచ్చింది.  

ఢిల్లీతోపాటు కాలుష్యం ఎక్కువగా నగరాల్లోనూ ఆంక్షలు విధించింది. గాలి నాణ్యత మోడరేటివ్‌ గా ఉన్న నగరాల్లో మాత్రం గ్రీన్ క్రాకర్స్ వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని , సుప్రీంకోర్టు ఆదేశాలతో ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే టపాసుల విక్రయాలు, కాల్చడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. టపాసుల విక్రయాలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ‌లపై విచారణ చేపట్టిన ఎన్జీటీ.. గతవారం 23 రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీచేసింది.

ఈ మేరకు ప్రజారోగ్యం, పర్యావరణ ప్రయోజనాల దృష్ట్యా నవంబరు 10 నుంచి 30 వరకు టపాసులను నిషేధించాలా, వద్దా, అని ఎన్ ‌జీటీ చైర్మన్‌ ఆదర్శకుమార్‌ గోయల్‌ ధర్మాసనం గత బుధవారం రాష్ట్రాల స్పందన కోరింది. కొవిడ్‌-19, వాయు కాలుష్యంపై నిపుణుల అభిప్రాయాలు స్పష్టంగా ఉన్నాయని, పెరిగిన వాయు కాలుష్యంతో వైరస్‌ మరింత నష్టం నలిగించవచ్చని ధర్మాసనం పేర్కొంది. నేషనల్‌ క్యాపిటర్‌ రీజియన్‌ను దాటి ప్రొసీడింగ్స్‌ పరిధిని పొడగించాల్సిన అవసరం కూడా ఉందని ట్రిబ్యునల్‌ తెలిపింది. అయితే టపాసుల విక్రయాలపై ఇప్పటికే నిషేధం విధించిన ఒడిశా, రాజస్థాన్‌ లకు ఎన్‌జీటీ నోటీసులు ఇవ్వలేదు.
Tags:    

Similar News