జనంతో జగన్ : నవంబర్ నుంచి అక్కడేనట... ?
మూడున్నరేళ్లుగా జగన్ పూర్తిగా తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కే పరిమితం అయిపోయారు అన్న విమర్శలు అయితే గట్టిగా ఉన్నాయి. దాంతో ఈ మధ్యనే ఆయన బటన్ నొక్కే పధకాలను , కార్యక్రమాలను నాలుగు గోడల మధ్య కాకుండా వివిధ జిల్లాలలో జనం మధ్యన చేస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు తాను చెప్పాలనుకుంటున్నది కొంత చెబుతున్నారు. అదే టైమ్ లో ఆయన విపక్షలాను కూడా గట్టిగా టార్గెట్ చేస్తున్నారు.
అయితే ఈ డోస్ ఏ కోశానా సరిపోదు అని జగన్ భావిస్తున్నాట్లుగా తెలుస్తోంది. ఎందుచేతనంటే చంద్రబాబు అలుపూ విరామం లేకుండా కాళ్ళకు బలపం కట్టుకుని జిల్లాలను చుట్టేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే దసరా నుంచి బస్సు యాత్ర పేరిట ఏపీ అంతా కలియతిరగాలనుకుంటున్నారు.
దాంతో విపక్షాలు చెప్పే విషయాలు జనాలకు నేరుగా చేరిపోతాయి. వాటికి కౌంటర్ చేయకుంటే కచ్చితంగా దాని ప్రభావం వచ్చే ఎన్నికల మీద పడి తీరుతుంది. అందుకే జగన్ ఇపుడు కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో జగన్ పాదయాత్రలు ఎటూ చేయలేరు. అలాగని జిల్లాలను పట్టి తిరగలేరు కూడా.
అందుకే ఆయన తాను ఇకపైన పల్లెలకు, గ్రామాలకు వెళ్లడం ద్వారా అక్కడ రచ్చబండ వద్ద కూర్చుని తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వారికి వివరిస్తూ వారి వద్ద ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని అక్కడికక్కడ పరిష్కరించాలని భావిస్తున్నాట్లుగా తెలుస్తోంది. దీని వల్ల ప్రజల సమస్యలు తనకు నేరుగా తెలుస్తాయి, వాటిని పరిష్కరించడం ద్వారా ప్రభుత్వానికి పేరు వస్తుంది, ఆ ఇంపాక్ట్ ఏపీ మొత్తానికి ఉంటుంది, ప్రచారం కూడా జరుగుతుంది అన్న ఉద్దేశ్యంలో ఈ కాన్సెప్ట్ ని డిజైన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
నవంబర్ నుంచి దీనికి శ్రీకారం చుడతారు అని అంటున్నారు. ఒక నాలుగు మండలాను కలిపి ఒక చోట ఈ తరహా రచ్చబండ కార్యక్రమాలను నిర్వహించాలని చూస్తున్నారు. ఇందులో మహిళలు ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వం దీనితో పాటుగా ప్రజల వద్ద నుంచి వచ్చే విన్నపాలు వినతులు పరిగణనలోకి తీసుకుని మరిన్ని కొత్త పధకాలను కూడా రూపకల్పన చేయవచ్చు అని అంటున్నారు.
అదే విధంగా ప్రభుత్వం ద్వారా ఏ పధకాన్ని అందుకోని సెక్షన్లకు, ముఖ్యంగా మధ్యతరగతి వారికి పట్టణాలలో ఉన్న వారికి కూడా ప్రయోజనం ఉండేలా రానున్న రోజుల్లో కొన్ని పధకాలు తీసుకురావాలన్న ఆలోచన అయితే ఉందిట. మరి జనంతో జగన్ పేరిట చేపట్టబోయే కార్యక్రమానికి స్పందన ఎలా ఉంటుంది అన్నది కూడా చూడాలి మరి.