ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న కొత్త రూల్.. ఇంటికి తీసుకెళ్లే జీతం తగ్గనుంది
ఉద్యోగులకు ఒక బ్యాడ్ న్యూస్. కొత్తగా అమల్లోకి రానున్న ఒక నిబంధన ఊహించని షాక్ ను ఇవ్వటమే కాదు.. మీ జేబుకు చిల్లు పెట్టటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. అదే సమయంలో కంపెనీలకు అదనపు భారం పడుతుందని చెబుతున్నారు. ఇంతకీ కొత్త అమల్లోకి రానున్న ఈ రూల్ ఏమిటంటే.. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఉద్యోగికి చెల్లించే పీఎఫ్ మొత్తాన్ని 10 శాతం నుంచి 12 శాతానికి పెంచారు. అంతేకాదు.. ఈ రూల్ లోని కొన్ని అంశాలు ఉద్యోగులు ప్రతి నెలా ఇంటికి తీసుకెళ్లే మొత్తంపై ప్రభావాన్ని చూపనున్నాయి.
కేంద్రం తాజాగా కోడ్ ఆన్ వేజెస్ 2019 నిబంధనను 2021 కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానుంది. దీని ప్రకారం.. అలవెన్స్ అనేది ఉద్యోగి వేతనంలో 50 శాతానికి మించకూడదు. అంటే.. రూపాయి బేసిక్ పే అయితే.. మిగిలిన అలవెన్సులు యాభై పైసలకు మించకూడదు. ఇప్పటివరకు కంపెనీలన్ని బేసిక్ పే ను తక్కువగా చూపించి.. అలవెన్సుల రూపంలో ఎక్కువ మొత్తాన్ని ఇస్తున్నారు. దీని కారణంగా పీఎఫ్ మొత్తాన్ని కంపెనీలు తక్కువగా ఇచ్చేవి.
మారిన నిబంధనతో బేసిక్ పే పెరుగుతుంది. ఈ పెరిగిన భారాన్ని కంపెనీలు భరించే అవకాశం ఉండనందున.. ఇతర అలవెన్సుల్ని కట్ చేయటంతో పాటు.. పీఎఫ్ ఖాతాకు అదనంగా చెల్లించే మొత్తానికి కోత విధిస్తారని చెబుతున్నారు. దీని వల్ల జరిగేదేమంటే.. నెల వారీగా చేతికి వచ్చే జీతం తగ్గుతుంది. దాని స్థానే పీఎఫ్ ఖాతాకు మళ్లుతుంది. మొత్తంగా చూస్తే.. ఉద్యోగికి కలిగే ఇబ్బంది ఏమంటే.. నెలవారీగా వచ్చే జీతంలో కొంతభాగం పీఎఫ్ పొదుపు ఖాతాకు డైవర్టు అవుతుంది. దీంతో.. నెలవారీగా కమిట్ మెంట్లు ఉండే వారికి ఇబ్బందికరంగా మారనుందని చెప్పాలి.