• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  శాస్త్రి తాష్కెంట్...

శాస్త్రి తాష్కెంట్ వెళ్లినప్పుడు నేతాజీ ఉన్నారా?

By - Tupaki Desk
Update: 2015-12-14 05:51 GMT
తాజాగా ఒక  ఫోటో కొత్త కలకలాన్ని రేపుతోంది. భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో అత్యంత మిస్టిరీయస్ నేతగా చెప్పుకునే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించిన చాలానే అంశాలు ఆసక్తికరంగా ఉండటమే కాదు.. కొత్త కొత్త ప్రశ్నల్ని తెరపైకి తీసుకొస్తుంటాయి. అలాంటిదే ఇప్పుడు మరో అంశం తెరపైకి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధంలో నేతాజీ మరణించారని చెబుతుంటే.. అలాంటిదేమీ లేదు.. ఆ తర్వాత రష్యాలో ఉన్నారంటూ చాలానే వాదనలు వినిపిస్తాయి. అయితే.. తాజాగా ఇందుకు సంబంధించిన ఒక ఫోటో వెలుగులోకి రావటం.. అందులో నేతాజీని పోలిన వ్యక్తి ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

నాటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రా రష్యాలోని తాష్కెంట్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో.. అక్కడి వారితో కరచాలనం చేసే సమయంలో ఒక ఫోటో తీశారు. ఇప్పుడు ఆ ఫోటో ఒక పెద్ద చర్చగా మారింది. ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి సుభాష్ చంద్రబోస్ పోలికలు ఉండటం ఇప్పుడు సందేహంగా మారింది. బ్రిటన్ కు చెందిన ఫోరెన్సిక్ ఫేస్ మ్యాపింగ్ నిపుణుడు నీల్ మిల్లర్ ప్రకారం లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ పర్యటన సందర్భంగా తీసిన ఫోటోలో ఆయనకు కాస్త వెనుక ఉన్న వ్యక్తి నేతాజీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

ఫోటోలో ఉన్న వ్యక్తి నేతాజీనా? కాదా? అన్న విషయాన్ని తేల్చాల్సిందిగా మిల్లర్ కు.. మిషన్ నేతాజీ మాజీ సభ్యుడైన సిద్ధార్త సత్ఫాయ్ ఫోటోల్ని ఇవ్వటం.. ఆయన దానిపై నిశితంగా పరిశోధనలు జరిపి.. ఫోటోలో కనిపిస్తున్న నేతాజీ ఒకటయ్యే అవకాశం భారీగా ఉందని చెప్పటం ఇప్పుడు ఆసక్తికరంగా మారటమేకాదు.. ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారినట్లేనని చెప్పక తప్పదు. వచ్చే ఏడాది జనవరిలో ప్రధాని మోడీ రష్యాకు వెళ్లనున్న నేపథ్యంలో నేతాజీకి సంబంధించిన రహస్య పైళ్లతో పాటు.. వాటి వివరాల్ని రష్యా బయటపెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరి.. ఈ అంశంపై తనకు తెలిసిన రహస్యాల్ని రష్యా  బయట పెడుతుందా? లేదా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
Tags:    
  • Netaji 
  • Subhas Chandra Bose 
  • Lal Bahadur Sastry 
  • Telugu NEws 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS