హైదరాబాద్ లో అమ్మాయిల పరిస్థితి అలానా..?

Update: 2017-01-20 11:08 GMT
హైటెక్ నగరంగా నాయకులు చెప్పుకునే హైదరాబాద్ గురించి ఒక షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఒక సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైన ఈ వివరాలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఉన్నత చదువుల కోసం కావొచ్చు.. ఉద్యోగాల కోసం కావొచ్చు.. కోచింగ్ ల కోసం కావొచ్చు.. కారణం ఏదైనా.. అమ్మాయిల.. అబ్బాయిలు హైదరాబాద్ కు వచ్చేస్తుంటారు. మరి.. ఇలా వచ్చే అమ్మాయిలకు అద్దెకు ఇళ్లు దొరికే విషయంలో చుక్కలు కనిపిస్తున్నాయిట.

హాస్టల్స్ లో ఉండే చిక్కులతో.. విడిగా ఉందామని.. అద్దెకు ఇళ్లు వెతుకుతుంటే.. ఇంటి ఓనర్లు ఒక పట్టాన తమ ఇళ్లను పెళ్లి కాని అమ్మాయిలకు అద్దెకు ఇవ్వటానికి ససేమిరా అంటున్నారట. ఈ విషయాన్ని నెస్ట్ ఎవే అనే పాపులర్ హోం రెంటల్ సంస్థ నిర్వహించిన సర్వేలో వెల్లడించింది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబయి.. బెంగళూరు.. పూణె.. హైదరాబాద్ లోని మూడు వేల మంది పెళ్లి కాని అమ్మాయిలతో మాట్లాడిన ఈ సంస్థ.. వారు చెప్పిన వివరాల్ని కలిపి అధ్యయనం చేశారట.

పెళ్లి కాని అమ్మాయిలకు హైదరాబాద్ లో ఇళ్లు ఇవ్వకపోటానికి కారణం.. నాన్ వెజ్ గా చెబుతున్నారు. భాగ్యనగరిలో నాన్ వెజ్ తింటామని చెప్పే అమ్మాయిలకు 19 శాతం మంది ఇంటి ఓనర్లు ఇళ్లు ఇచ్చేందుకు నో అంటే నో చెప్పేస్తున్నారట. అంతేకాదు.. కొందరికి ప్రాంతీయతత్వం.. మరికొందరు కుల.. మతాల్ని పరిగణలోకి తీసుకొని ఇళ్లు ఇవ్వటానికి ససేమిరా అంటున్నారట. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. హైదరాబాద్ లో నాన్ వెజ్ విపరీతంగా తింటారన్న పేరుంటే.. మాంసాహారం తినే వారికి అద్దెకు ఇళ్లు ఇవ్వటానికి నో అనటం ఏమిటో అర్థం కాని విషయమేనని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News