విమానంలో గంట జర్నీకి రూ.2500

Update: 2017-04-27 09:40 GMT
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీపై తిరుగులేని విజయం సాధించిన ఒక్క రోజులోనే మోడీ ఈ దేశంలోని ఆమ్ ఆద్మీకి సంతోషం కలిగించే పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. హెలికాప్టర్ - విమానాల్లో ప్రయాణం సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్‌ (ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌) పథకాన్ని నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటన విడుదల చేసింది.
    
హెలికాప్టర్ లో అరగంట - విమానంలో గంట ప్రయాణానికి (సుమారు 500 కిలోమీటర్ల దూరానికి) 2,500 రూపాయలు మాత్రమే వసూలు చేయనున్నారు. గత ఏడాది ప్రధాని ఘనంగా ప్రకటించిన ఈ పథకం నేటి నుంచి గగన విహారం చేయనుంది.

‘ఉడాన్’ పథకంలో భాగంగా తొలి ప్రాంతీయ విమానాన్ని సిమ్లా-ఢిల్లీ మధ్య నడపనుండగా, ఈ విమానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. అలాగే కడప-హైదరాబాద్, నాందేడ్-హైదరాబాద్ మధ్య తిరిగే ‘ఉడాన్’ విమానాలను కూడా ఆయన ప్రారంభించనున్నారు. గంట ప్రయాణానికి రూ.2,500 మాత్రమే వసూలు చేయాలనే ఉద్దేశంతో ఉడాన్ (ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని మోదీ సర్కార్ గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే. కడప-హైదరాబాద్, నాందేడ్-హైదరాబాద్ మధ్య తిరిగే ‘ఉడాన్’ విమానాలను ప్రధాని ప్రారంభించనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News