బీజేపీ గెలిస్తే ఆర్థికమంత్రి ఈయనేనా?
మే 23న తుది ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఈ ఆదివారం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ మోడీ రెండోసారి ప్రధాని కాబోతున్నాడని స్పష్టం చేశాయి. గెలుపు ధీమాతో ఉన్న బీజేపీ ఈ మేరకు ప్రమాణ స్వీకారం సహా కేంద్ర మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది.
తాజాగా బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తుందని తెలియడంతో మార్కెట్లు పరుగులు తీశాయి. సెన్సెక్స్ ఎగిసి 6 లక్షల కోట్ల లాభాలను ఒక్కరోజే తెచ్చిపెట్టింది. దేశానికి ఆర్థిక దన్నును అందించే కీలకమైన ఆర్థిక శాఖ మంత్రి పదవిని ఈసారి బీజేపీలో ఎవరికి ఇస్తారు.? మరోసారి అరుణ్ జైట్లీని కొనసాగిస్తారా ? లేదా అన్నది ఆర్థిక - వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మోడీ కేబినెట్ లో సీనియర్ నేత - ట్రబుల్ షూటర్ - పైగా న్యాయవాది - ఆర్థిక వేత్త అయిన అరుణ్ జైట్లీ పోయినసారి ఆర్థిక మంత్రిగా ఉన్నారు. కానీ ఆయనకు కిడ్నీలు ఫెయిల్ అయ్యి రీ ప్లాంటేషన్ చేయించుకోవడంతో రెండు సార్లు జైట్లీ స్థానంలో రైల్వే - బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆర్థిక మంత్రి బాధ్యతలు సమర్థంగా నిర్వహించారు. జైట్లీకి మించి సంస్కరణలు చేపట్టి ఆకర్షించాడు. దీంతో బీజేపీ రెండో ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి పదవికి జైట్లీ - పీయూష్ ల మధ్య పోటీ నెలకొంది. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం అరుణ్ జైట్లీ వైపే మొగ్గుచూపిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ ఆయనకు ఆరోగ్యం సహకరించదంటే మాత్రం పీయూష్ కు ఇవ్వాలని యోచిస్తోంది. మొత్తంగా కొందరు జైట్లీ పేరు. మరికొందరు పీయూష్ పేరు చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక మంత్రి పదవి కత్తిమీద సామే. 2018లో ఆర్థిక వృద్ధి రేటు 6.6శాతానికి పడిపోయింది. పెరుగుతున్న ఇంధన ధరలు ఆర్థిక వ్యవస్థకు సవాల్ గా మారాయి. అందుకే ఆర్తిక శాఖ అంత ఈజీకాదని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆర్థిక మంత్రి పదవి ఉత్సవవిగ్రహమని.. అంతా ప్రధాని కార్యాలయమే చూసుకుంటుందని.. ఎవరికిచ్చినా డమ్మీనేని కేర్ రేటింగ్స్ ప్రధాన ఆర్థికవేత్త సబ్నావిస్ స్పష్టం చేశారు.