జగనొచ్చారని..నితీశ్ ను మోదీ దూరం పెట్టేశారే

Update: 2019-06-20 04:10 GMT
జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు ఢిల్లీలో బుధవారం జరిగిన అఖిలపక్ష భేటీలో చాలా చిత్రాలే చోటుచేసుకున్నాయి. ఏపీకి రీసౌండింగ్ విక్టరీ సాధించిన వైసీపీ అధినేత - కొత్తగా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ భేటీలో ఎనలేని ప్రాధాన్యం దక్కింది. పాలిటిక్స్ లో సీనయర్ మోస్ట్ నేతలుగానే కాకుండా విధాన నిర్ణయాల్లో తమదైన శైలిలో సత్తా చాటిన నేతలకు కూడా దక్కని రీతిలో జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ అత్యధిక ప్రాదాన్యం ఇచ్చారు. అంతేకాదండోయ్... బీహార్ సీఎంగా వరుసగా మూడు సార్లు పదవీ బాధ్యతలు చేపట్టడమే కాకుండా దేశంలో మంచి గుర్తింపు సంపాదించిన సీనియర్ నేత - జేడీఎస్ అధినేత నితీశ్ కుమార్ ను మోదీ కాస్తంత దూరం పెట్టేశారు.

ఈ భేటీలో దీర్ఘ చతురస్రాకారంలోని టేబుల్ చుట్టూ అంతా కూర్చుంటే... అధ్యక్ష స్థానంలో మోదీ కూర్చుంటే... మోదీకి ఓ వైపున బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొత్తగా నియమితులైన జేపీ నద్దా కూర్చున్నారు. మోదీకి మరోవైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూర్చున్నారు. ఇక టేబుల్ కు రాజ్ నాథ్ సింగ్ కూర్చున్న వైపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూర్చోగా - ఆయన పక్కన కేంద్ర మంత్రులు - పలు పార్టీలకు చెందిన నేతలు కూర్చున్నారు. అంటే... ఆ వరుస అమిత్ షాతో మొదలైందన్న మాట.

ఇక నద్దా కూర్చున్న వైపున ఫస్ట్ ప్లేస్ లోనే జగన్ కూర్చుంటే... ఆ తర్వాత నితీశ్ - ఆ తర్వాత టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూర్చున్నారు. అంటే ఈ వరుస జగన్ తోనే ప్రారంభమైందన్న మాట. ఇక ఈ వరుసలో కేటీఆర్ తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూర్చున్నారు. మొత్తంగా కొత్త సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన జగన్ కు మోదీ చాలా ప్రయారిటీనే ఇచ్చారనే చెప్పాలి. అంతేకాకుండా జగన్ ను దగ్గరికీ తీసుకున్న మోదీ... మొన్నటిదాకా తనకు సన్నిహితంగా ఉన్న నితీశ్ ను దూరం పెట్టేశారు. బీజేపీ, జేడీయూ మద్య ఇటీవల పొడచూపిన విభేదాలతో నితీశ్ ను దూరం పెట్టిన మోదీ... అదే సమయంలో బీజేపీకి సన్నిహితంగా వ్యవహరిస్తున్న జగన్ ను దగ్గరకు తీసుకున్నారన్న మాట.

Tags:    

Similar News