ఎంఎస్ ధోని స్టైలిష్ లుక్.. వైరల్

Update: 2021-07-30 08:33 GMT
ఎంఎస్ ధోని.. జులుపాల జట్టుతో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి.. కెప్టెన్ అయ్యి భారత క్రికెట్ జట్టు తలరాతను మార్చేశాడు. ఆ తర్వాత గుండుతో.. అరగుండుతో.. కట్ హెయిర్ తో ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త లుక్ లో ధోని కనిపిస్తుంటాడు.

తాజాగా ఒక నెల క్రితం తనదైన శైలిలో భారీ మీసాలను పెంచి అలరించాడు. తాజాగా మరో మేకవర్ ను ధోని ప్రదర్శించాడు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ఎంఎస్ ధోనిని మరో ఆకర్షనీయమైన సూపర్ లుక్ లోకి మార్చేశాడు.

పదునైన రేజర్ గడ్డంతోపాటు ఉబర్ కూల్ ఫాక్స్ హాక్ కట్ లో ధోని మైండ్ బ్లోయింగ్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ లుక్ ధోనికి బాగా సరిపోయింది. అభిమానులు ధోని లుక్ చేసి విపరీతంగా ఆయన ఫొటోను షేర్లు చేస్తున్నారు. చాలా మంది అలాంటి లుక్ ను ట్రై చేస్తున్నారు. గ్లోబల్ క్రికెట్ ఐకాన్ వేసుకున్న ఈ అత్యంత స్టైలిష్ లుక్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఎంఎస్ ధోని ఎలాంటి లుక్ , రూపంలోనైనా ఇట్టే మారిపోగలడు.అభిమానులు అతడిని పిచ్చిగా ఆరాధిస్తారు.ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ధోని లుక్ ను ఇప్పుడు చాలా మంది అనుకరిస్తున్నారు. అతడి లుక్ కు ఫిదా అవుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.. ధోని తనను తాను మార్చుకుంటూ విలాసవంతమైన లుక్స్ తో ప్రతిసారి ఆకర్షిస్తూనే ఉంటాడు.


Tags:    

Similar News