• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మన 'స్లమ్ డాగ్'.. ఇప్పుడు...

మన 'స్లమ్ డాగ్'.. ఇప్పుడు మిలియనీర్

By - Tupaki Desk
Update: 2017-02-21 14:25 GMT
‘మహ్మద్ సిరాజ్’ పేరు ఎప్పుడైనా విన్నారా? లేదనే చెబుతారు.కానీ.. ఇప్పుడు అతని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కాదు.. తన ఆట తీరుతో అందరిని మాట్లాడుకునేలా చేశాడు. రంజీల్లో ఆడే ఈ హైదరాబాదీ ఆటగాడికి ఇప్పటివరకూ పడిన కష్టానికి తగిన ఫలితం దక్కింది. నిన్నమొన్నటి వరకూ భారత్ ఏ తరఫు ఆడితే చాలన్న లక్ష్యంతో ఉండే సిరాజ్ మైండ్ సెట్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.

తనకు లభించిన సువర్ణావకాశాన్ని వినియోగించుకొని రంజీల్లో సత్తా చాటిన అతగాడు.. ఇప్పుడు ఐపీఎల్ లో తానేంటో లోకానికి తెలియజేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. నిన్నటి వరకూ సిరాజ్ అంటే ఎవరికి తెలీనివాడు.. ఇప్పుడు అందరికి తెలిసిపోయారు. ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.2.6 కోట్లకు సిరాజ్ ను కొనుగోలు చేయటంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చేసి.. హాట్ న్యూస్ గా మారిపోయాడు.

సిరాజ్ జీవితాన్ని.. అతడి క్రికెట్ ప్రయాణాన్ని చూసినప్పుడు.. సినిమాటిక్ గా ఉంటుంది. నిన్నటి వరకూ కడు పేదరికంతో ఉన్న ఈ కుటుంబ పరిస్థితి.. ఐపీఎల్ వేలం ఒక్కసారిగా పరిస్థితిని మార్చేసింది. సిరాజ్ తండ్రి ఆటో డ్రైవర్. నిత్యం ఆటోతోలుతూ.. వచ్చే డబ్బులతో కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. కొడుకు ఇష్టాన్ని కాదనలేక అతడ్ని.. క్రికెటర్ గా చేయాలని తపించటమే కాదు.. ఆయన కలను సిరాజ్ కొంతమేర నెరవేర్చాడని చెప్పాలి.

తన తండ్రి కష్టాన్ని సిరాజ్ మాటల్లోనే చెప్పాలంటే.. ‘‘మా కోసం.. మా కుటుంబం కోసం మా నాన్న 30 ఏళ్లు ఆటో నడుపుతున్నాడు.  ఐపీఎల్ వేలం నా జీవితంలో గొప్ప  సంఘటన. నన్ను ఏదో ఒక ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుందని అనుకున్నాను కానీ.. రూ.2.6కోట్ల ధర పలుకుతానని అస్సలు అనుకోలేదు. ఐపీఎల్ ద్వారా వచ్చే డబ్బుతో.. మా నాన్నను ఆటో నడపటం మానిపిస్తా. ఇల్లు కొంటా. నాన్నతో పాటు.. నా కుటుంబాన్ని చూసుకుంటా. భారత జట్టులో స్థానం సంపాదించటమే లక్ష్యంగా ఆడతా. ఇక.. నా సత్తా చాటుతా’’ అని చెప్పుకొచ్చాడు.

వార్నర్.. యువరాజ్.. ముస్తాఫిజుర్.. భువనేశ్వర్ లతో ఆడే రోజు కోసం ఎదురుచూస్తున్నా. బెంగళూరుతో మ్యాచ్లో ఆడే అవకాశం లభించాలని తాను కోరుకుంటున్నట్లు సిరాజ్ వెల్లడించాడు. క్రిస్ గేట్.. విరాట్ కోహ్లీ.. డివిలియర్స్ లకు బౌలింగ్ చేయటానికి మించిన గొప్ప విషయం మరొకటి ఉండదన్న సిరాజ్.. తన కలల్ని నెరవేర్చుకోవాలని ఆశిద్దాం. నిండు మనసుతో.. అతడికి ఆల్ ద బెస్ట్ చెబుదాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Mohammed Siraj 
  • Sunrisers Hyderabad 
  • Telugu NEws 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS