• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జయలలితకు అంత సీరియస్ గా...

జయలలితకు అంత సీరియస్ గా ఉందా..?

By - Tupaki Desk
Update: 2015-08-07 11:52 GMT
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితి ఆరోగ్యం మరోమారు తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడతున్నారన్న విషయం శుక్రవారం నాటి పరిణామలతో తేటతెల్లమైంది.  మద్రాసు విశ్వవిద్యాలయంలో జరిగిన 'జాతీయ చేనేత దినోత్సవం' కార్యక్రమానికి ఆమె గైర్హాజరు కావడంతో జయలలిత అభిమానులు,ఏఐఏడిఎంకె కార్యకర్తలలో అనేక సందేహాలు వస్తున్నాయి. 'జాతీయ చేనేత దినోత్సవం' కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ప్రధాని మోడీకి విమానాశ్రయంలో గవర్నర్ రోశయ్యతో కలసి జయలలిత ఘన స్వాగతం పలికారు. ఆ తరువాత ఆమె తన ఇంటికి వెల్లిపోయారు... మోడీ పాల్గొన్న కార్యక్రమానికి హాజరు కాలేదు. ఆమె తరఫున హాజరైన ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జయలలిత ప్రసంగ పాఠాన్ని చదివి వినిపించారు. ప్రధాని హాజరైన ఈ ప్రధానమైన కార్యక్రమానికి జయలలిత గైర్హజరవడంతో ఆమె ఆరోగ్యం ఇంకా ఏమాత్రం బాగులేన్న వాదనకు బలం చేకూరుస్తోంది. నిజానికి కేంద్రంతో జయలలిత సంబంధాలు బాగానే ఉన్నాయి... వ్యక్తిగతంగానూ మోడీతో వివాదమేమీ లేదు. ఈ నేపథ్యంలో ఆమె గైర్హాజరీకి రాజకీయ కారణాలేవీ లేవు.

మరోవైపు ప్రధాని మోడీ జయలలిత ఇంటికి వెళ్లడంతో ఆమెను పరామర్శించడానికే అయ్యుంటుందని అంతా భావిస్తున్నారు. గతంలోనూ పలుమార్లు జయతో మోడీ సమావేశమైనా ఇలా నేరుగా ఇంటికి వెళ్లడమనేది ఇంతవరకు లేదు. దీంతో ఆమె అనారోగ్యం గురించి తెలిసే ప్రధాని వెళ్లి పరామర్శించి ఉంటారని చెబుతున్నారు. జయ ఆరోగ్యంపై వివిధ రకాలుగా అనుకుంటున్నా ఎవరూ నోరు విప్పలేకపోతున్నారు. మొత్తానికి జయ క్లిష్ట పరిస్థితుల్లో ఉందని మాత్రం అక్కడి రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
Tags:    
  • Modi 
  • Jayalalitha 
  • Poes Garden 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS