ఆ విషయంలో భారత్ బెస్ట్..: మోదీ
ప్రపంచంలో వాతావరణ పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి.. భూతాపం పెరిగి జనజీవనం అల్లకల్లోలం అవుతోంది.. ఇందుకు కర్భన ఉద్గారాలను విడుదల చేయడమే.. అయితే అవి సంపన్న దేశాలు వినియోగిస్తున్న పారిశ్రామిక విధానంతోనే.. అభివృద్ధి చెందిన దేశాలు తమ వస్తువుల ఉత్పత్తిలో భాగంగా ఫ్యాక్టరీలు, కంపెనీల ద్వారా అధికంగా కర్భన ఉద్గారాలను విడుదల చేస్తోంది... దీంతో వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.. కానీ భారత్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది.. ఇక్కడ పర్యావరణాన్ని సంరక్షించేందుకు అనేక చర్యలు, పథకాలు ప్రవేశపెడుతున్నాం.. అని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రసంగించారు.
ప్రపంచ పర్యావరవణ దినోత్సవం సందర్భంగా సద్దుగు జగ్జీ వాసుదేవ్ ఏర్పాటు చేసిన 'మట్టిని వాడుకుందాం' అనే కార్యక్రంలో ప్రధాని నరేంద్రమోది ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందన్నారు.
సారవంతమైన మట్టిపై కొందరు రైతులకు అవగాహన లేదన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందకు రైతులకు సాయిల్ కార్డులు ఇవ్వడానికి భారత్ పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించిందన్నారు. 'సేవ్ సాయిల్ మూవ్ మెంట్' ద్వారా నేలలో సారం క్షీణించడంపై ఈషా ఫౌండేషన్ చేపట్టిన ప్రపంచ వ్యాప్త ఉద్యమంపై ఆ ఫౌండేషన్ నేత అధినేత జగ్గీ వాసుదేవ్ ను అభినందించారు.
ఇక కర్భన ఉద్గారాలను తగ్గించేందుకు ముందే ప్రణాళికలు వేసుకున్నామని అన్నారు. పెట్రోల్ లో 10 శాతం ఇథనాల్ ను కలపాలన్న లక్ష్యంతో గడువు కంటే ముందే సాధించినట్లు తెలిపారు. కొన్నేళ్ల ముందే శిలాజేతర ఇందనాల ద్వారా 40 శాతం విద్యుత్ ఉత్పత్తిని సాధిస్తున్నామన్నారు. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్, నమామి గంగ, ఒకే సూర్యుడు- ఒకే ఇంధన వ్యవస్థ వంటి పథకాలతో భారత్ పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతుందన్నారు.
అయితే కొన్ని దేశాలు సహజ వనరులను దోపిడీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. పర్యావరణాన్ని పట్టించుకోకుండా విపరీతంగా కర్భన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయన్నారు.
ఇదంతా సంపన్న దేశాల్లోనే అధికంగా జరుగుతుందన్నారు. వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయోనని ఆలోచించకుండానే ఆ దేశాలు తమ స్వార్థం కోసం పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నానయని ధ్వజమెత్తారు.