• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  టీఆర్ ఎస్ లో ముసలం:...

టీఆర్ ఎస్ లో ముసలం: మంత్రి ఎదుట ఎమ్మెల్యే రచ్చ

By - Tupaki Desk
Update: 2020-02-27 15:30 GMT
తెలంగాణ అధికార పార్టీలో విబేధాలు ఉన్నా అవి బహిర్గతం కావడం లేదు. ఎందుకంటే పెద్దబాస్, చిన్న బాస్ లకు నచ్చవు. ఒక్కసారి అలాంటివి జరిగితే ఎంతటి పెద్ద నాయకుడినైనా వారు చీపురు పుల్ల మాదిరి పక్కన తీసి పడేస్తారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీమంత్రులనే ఆ విధంగా చేశారు. అలాంటి పరిస్థితులు ఉండడంతో ఎంతటి విబేధాలు ఉన్నా పార్టీ నాయకులు కిమ్మనకుండా సర్దుకుపోతున్నారు. అయితే అక్కడక్కడ అవి బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో బహిర్గతమయ్యాయి. ఏకంగా అధికారుల సమక్షంలోనే మంత్రి, ఎమ్మెల్యేలు విమర్శలు చేసుకున్నారు. ఒక మహిళా మంత్రి అని కూడా చూడకుండా ఆ ఎమ్మెల్యే దుర్భాషలాడడం విస్మయానికి గురి చేసింది.

మహబూబాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ లో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై కలెక్టర్ ఇతర జిల్లా అధికారులతో సమీక్ష చేశారు. సమావేశం ప్రారంభమైన అనంతరం మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌‌ హాజరయ్యారు. సమావేశం కొనసాగుతుండడం తో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే గా ఉన్న తాను రాకుండానే సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.

తాను ఆర్‌ఈసీలో చదువుకున్నానని.. ఎర్రబస్సు ఎక్కి రాలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. మంత్రి ఉన్నా కూడా అధికారుల తీరుపై కస్సుబుస్సులాడారు. మంత్రిపై ఉన్న కోపాన్ని అధికారులపై తీర్చుకున్నారు. సమీక్ష సమావేశాలు కేవలం ఫొటోలు దిగడానికి పరమితమవుతున్నాయంటూ పరోక్షంగా మంత్రి విమర్శిస్తూ చేశారు. స్థానికంగా ఉన్న సమస్యలు ఎమ్మెల్యేగా తనకు తెలుసని.. ఆ సమస్యలను మంత్రులు, కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లాల్సింది తాను అని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే రాకుండా సమావేశం ఎలా నిర్వహిస్తారని నిలదీశారు. దీనిపై కలెక్టర్‌ స్పందించి సమాచార లోపంతో ఇలా జరిగిందని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.

అయినా శంకర్‌ నాయక్‌ వినిపించుకోక పోవడంతో మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. ఎమ్మెల్యే ముఖం చూడకుండానే అతడి వైఖరిని తప్పుబట్టారు. సమయానికి మీరు రాకుండా మాపై ఎగిరితే సరికాదని హితవు పలికారు. ఏదో జరిగిందని రాద్ధాంతం చేయడం సరికాదని తెలిపారు. సమావేశం మొత్తం ముఖం ఎమ్మెల్యేను చీదరించుకుంటూనే మంత్రి సమీక్ష చేశారు. ఎమ్మెల్యే తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌‌ వైఖరి మొదటి నుంచి గుండాలా ప్రవర్తిస్తున్నాడని, ఆయన అరచకాలు ఎక్కువయ్యాయని స్థానిక నాయకులతో పాటు ప్రజలు చెబుతున్నారు. ఆయన వైఖరిలో ఏమీ మార్పు ఉండడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. మరి దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    
  • MLA Shankar Naik verses Satyavathi Rathod 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Politics 
  • Telangana Political Updates 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

Copyright @2026

Powered by Blink CMS