• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కదిలించిన తుపాకీ...

కదిలించిన తుపాకీ కథనం..రోజా చొరవతో స్పందించిన టీఆర్ ఎస్ సర్కార్

By - Tupaki Desk
Update: 2020-04-18 07:50 GMT
‘తుపాకీ’ కథనం వైసీపీ ఎమ్మెల్యే రోజాను కదిలించింది.. కరిగిపోయేలా చేసింది. ఆ బాధితుడిని ఆదుకునేందుకు స్వయంగా ముందడుగు వేసేలా చేసింది. కరోనా-లాక్ డౌన్ తో లండన్ లో చిక్కుకుపోయి అస్వస్థతకు గురై ప్రాణాలతో పోరాడుతున్న బాధితుడిని ఆదుకునేందుకు చొరవ చూపేలా చేసింది. ఓ మంచి ప్రయత్నం చేసిన రోజాకు, ఆ కథనాన్ని ప్రచురించి వెలుగులోకి తీసుకొచ్చిన ‘తుపాకీ.కామ్’పై.. స్పందించిన ఎంపీ - టీఆర్ ఎస్ సర్కారుపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

‘తుపాకీ’. కామ్  వెబ్ సైట్ లో ఏప్రిల్ 16న ప్రచురించిన ‘నేను ఎక్కువ రోజులు ఉండేలా లేను ..ఇండియాకు తీసుకెళ్లండి!’ కథనానికి వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. వరంగల్ కు చెందిన   ‘సందీప్ నాథ్ దాసి’   హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్  ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. కంపెనీ పనిలో భాగంగా గత సెప్టెంబర్ నెలలో లండన్ వెళ్ళారు. మార్చి 14న అస్వస్థత చెందారు. అయితే అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూనే విధులకు హాజరయ్యారు. మార్చి 16న ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం విషమించింది. రుమటాయిడ్ ఆర్థ్రయిటీస్ జబ్బు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇండియా కు వచ్చే ప్రయత్నం చేసాడు. కానీ అప్పటికే లండన్ లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించింది. మార్చి 18 నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిషేధించారు. దీంతో సందీప్ నాథ్ లండన్ లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం బ్రిటన్ లో లాక్ డౌన్ తో బయట కు రాలేక.. ఇండియాకు తిరిగిరాలేక.. జబ్బుతో నడవలేని స్థితిలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు.

 ఇప్పటికే తనను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్య నాయకులకు.. వరంగల్ లోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కూడా ట్విట్టర్ ద్వారా  సందీప్ నాథ్ ఆవేదన పంపించాను కానీ తగిన విధంగా స్పందన రాలేదు. మీడియాకు ఈ విషయం తెలుపగా..  రెండు రోజుల క్రితం ‘తుపాకీ.కామ్’ బాధితుడి దీనగాథను పబ్లిష్ చేసింది.

తాజాగా ఈ కథనాన్ని చదివిన వైసీపీ ఎమ్మెల్యే రోజా కదిలిపోయారు. వెంటనే తనకు తానుగా చొరవ తీసుకొని తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సడ్డకుడి కుమారుడు - రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వరంగల్ నాయకులను సంప్రదించి వివరాలు కనుక్కొన్నారు. ఆదుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

వైసీపీ ఎమ్మెల్యే రోజా విజ్ఞప్తికి రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ వేగంగా స్పందించారు. లండన్ లో చిక్కున్న సందీప్ నాథ్ విషయం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. లాక్ డౌన్ తో విమానాల రాకపోకలు బంద్ కావడంతో తీసుకురాలేకపోతున్నామని.. లాక్ డౌన్ ముగియగానే తీసుకొస్తామని ఎమ్మెల్యే రోజాకు హామీ ఇచ్చారు. వరంగల్ నాయకులు సైతం ఈ విషయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.

ఇలా వైసీపీ ఎమ్మెల్యే రోజా చొరవ తీసుకొని ‘సందీప్ నాథ్ ’ దీనగాథను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసి అందరి దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ బాధితుడి నరకయాతనను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అంతే వేగంగా తెలంగాణ ఎంపీ సంతోష్ స్పందించారు. రోజా చొరవ.. ‘తుపాకీ’ కథనం తో బాధిత కుటుంబానికి న్యాయం జరగడానికి వీలు చిక్కింది. తొందరలోనే సందీప్ నాథ్ భారత్ కు తిరిగి రావడానికి మార్గం సుగమం అయ్యింది.

సందీప్ తో పటు ఇంకా ఇలా స్ట్రక్  అయిన మన NRI లను వెనక్కి తీసుకురావాల్సిన అవసరం చాలా అర్జెంట్ గా ఉంది అని తుపాకీ మన పొలిటిషన్స్ కి వివరించింది
Tags:    
  • Software employee in london request to kcr 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Politics 
  • Telangana Political Updates 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS