• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పోలవరంపై మరీ ఇంత అబద్ధమా...

పోలవరంపై మరీ ఇంత అబద్ధమా ?

By - Tupaki Desk
Update: 2021-08-10 04:47 GMT
‘పోలవరం నిర్మాణానికి అయ్యే ఖర్చును నూరుశాతం కేంద్రమే భరిస్తోంది’.. ఇది తాజాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ పార్లమెంటులో చేసిన ప్రకటన. 2014, ఏప్రిల్ 1 నుండి ప్రాజెక్టుకయ్యే ఖర్చు మొత్తాన్నే కేంద్రమే భరిస్తోందని మంత్రి చెప్పారు. నిజానికి పోలవరం ప్రాజెక్టంటే నాలుగు గోడలు, గేట్లు పెడితే సరిపోతుందని కేంద్రం అనుకుంటోందో ఏమో అర్ధం కావటంలేదు.

నిజానికి పోలవరం అనే కాదు ఏ ప్రాజెక్టు అయినా భూ సేకరణ, భూములు కోల్పోవారికి ఇవ్వాల్సిన నష్టపరిహారం, వారి పునరావాసం లాంటి అనేక ఖర్చులను కలిపి ప్రాజెక్టు వ్యయాన్ని లెక్కకడతారు. ఇక్కడ పోలవరం ప్రాజెక్టంటే భూసేకరణ, నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారం, పునరావాసం ఖర్చులు మొత్తం కలిపి రు. 55, 725 కోట్లుగా రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది కేంద్రానికి. అయితే కేంద్ర జలశక్తి సవరించిన అంచనాలకు అంగీకరించటంలేదు. 2013లో సవరించిన అంచనాలు రు. 20,392 కోట్లు  మాత్రమే చెల్లిస్తానని పదే పదే చెబుతోంది.

భూసేకరణ, పునరావాసం, నష్టపరిహారానికే సుమారు రు. 30 వేల కోట్లకు పైగా అవుతుందని అంచనా. అంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే 100 శాతం ఖర్చును కేంద్రమే భరిస్తోందని గజేంద్ర షెకావత్ చెప్పటం పూర్తిగా అబద్ధమే. సవరించిన అంచనాలను చంద్రబాబునాయుడు, ఇపుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కేంద్ర జలశక్తి శాఖకు పంపింది. అయితే ఆ ప్రతిపాదనలు జలశక్తి సాంకేతిక సలహాదారు విభాగంలోనే పెండింగ్ ఉండిపోయింది.

 అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే మంత్రి పార్లమెంటులోను, వైసీపీ ఎంపిలు కలిసినపుడు ఒకమాట చెబుతున్నారు. తన మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులకు మాత్రం మరోలాగ ఆదేశాలిస్తున్నారు. అందుకనే రాష్ట్రప్రభుత్వం నుండి వెళ్ళిన సవరించిన అంచనా ప్రతిపాదనలు జలశక్తి శాఖలోని టెక్నికల్ అడ్వయిజరీ కమిటి దగ్గరే పెండింగ్ లో ఉండిపోయింది. కమిటి దగ్గర నుండి ఫైల్ మంత్రికి చేరితే సమస్య అయిపోతుందని కమిటి దగ్గరే ఫైలును ఉంచేశారని సమాచారం.

మొత్తానికి నరేంద్రమోడి సర్కార్ ఏపి ప్రయోజనాల విషయంలో చాలా అబద్ధాలే చెబుతోందని జనాలకు అర్ధమైపోయింది. కేంద్రం పొడుస్తున్న తూట్లను ఏపి బీజేపీ నేతలు పూడ్చలేక నానా అవస్తలు పడుతున్నారు. కేంద్రాన్ని బహిరంగంగా విమర్శించలేక, అలాగని కేంద్రం వైఖరిని సమర్ధించలేక పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. చూద్దాం ముందు ముందు కేంద్రం ఇంకెన్ని అబద్ధాలాడుతుందో.
Tags:    
  • Minister Gajendra Shekhawat 
  • Polavaram Project 
  • Polavaram Project Details 
  • Polavaram Project Rapire Phase 
  • Polavaram Project Details 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS