శూరత్వంపై ఇప్పుడేమంటావ్ మసూద్!

Update: 2016-09-30 12:47 GMT
సైలంట్ గా ఉందంటే సింహం గర్జించదనా...

ప్రశాంతంగా కనిపిస్తుందంటే పులి పంజా పవర్ తగ్గిందనా...

శాంతి శాంతి అంటుంటే చేతకాని వాళ్లమనా...

సినిమాల్లో  శూరత్వం చూపిస్తే నిజ జీవితంలో చేయలేమనా...    

సరిగ్గా పదిరోజుల క్రితం సెప్టెంబరు 19న రంగొనూర్ అనే వెబ్ సైట్ లో "ది రియల్ ఫౌంటెన్ హెడ్ ఆఫ్ పవర్" అనే పేరుతో సుమారు పదినిమిషాల న్యూస్ బులిటెన్ వీడియో ఒకటి పోస్ట్ అయ్యింది. ఈ వీడియోలో మసూద్ అజహర్ అనే ఉగ్రవాది కారు కూతలు కూశాడు. "భారతీయుల శూరత్వం బాలీవుడ్ కే పరిమితం" అంటూ చవకబారు వ్యాఖ్యలు చేశాడు. "బాలీవుడ్ సినిమాల్లోని హీరోలు ‌తమ నీడను చూసి తామే భయపడుతుంటారు... కానీ, సినిమాల్లో మాత్రం భారతీయులు బలమైన వారని చెబుతూ పాకిస్థాన్ పై దాడి చేసినట్టు - పాక్ క్యాంపులను ధ్వంసం చేసినట్లు చూపిస్తూ మురిసిపోతుంటారు" అని ప్రకటన చేశాడు.

కట్ చేస్తే... ఆ మాటలు మాట్లాడి సరిగ్గా పదిరోజులు అవుతుందో లేదో భారత శూరత్వం శాంపుల్ రుచి చూపించింది. మసూద్ - భారత శూరత్వంపై వ్యాఖ్యలు చేసి 10 రోజులు కూడా గడవక ముందే ఇండియన్ పారామిలిటరీ కమెండోలు పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని పాకిస్థాన్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడి చేసి 35 - 40 మంది ఉగ్రవాదులను హతం చేశారు! భారత సైన్యం నియంత్రణ రేఖను పకడ్బందీ వ్యూహంతో దాటి సుమారు మూడు కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లి 7 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేసింది. ప్రస్తుతం ఈ సర్జికల్ స్ట్రైక్ వార్త ఆ ఉగ్రవాది చెవిన పడిందో లేదో... ఇకపై ఇలాంటి కూతలు కూయడానికి ఎంత ఆలోచిస్తాడో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News