• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబు కొత్త ఇంటిపై...

బాబు కొత్త ఇంటిపై మావోయిస్టుల రెక్కీ?

By - Tupaki Desk
Update: 2017-04-15 06:04 GMT
పక్షి కన్ను కూడా పడకుండా.. చీమకు కూడా తెలియకుండా కట్టుకున్న చంద్రబాబు కొత్త ఇంటిపై మావోయిస్టులు రెక్కి నిర్వహించినట్లుగా తెలుస్తోంది. అది కూడా చంద్రబాబు కొత్తింటికి గృహ ప్రవేశం చేసిన రోజునే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
    
నిజానికి చంద్రబాబు జూబ్లీ హిల్సులో ఈ ఇల్లు కడుతున్నప్పటి నుంచి అటువైపు ఎవరినీ రానివ్వకుండా ఏపీ పోలీసులతోనే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆ మార్గంలో ఇల్లు ఉన్న కొద్ది మంది ప్రముఖులకు తప్ప ఇతరులెవరినీ రానివ్వకుండా ఆ మార్గంలో రాకపోకలను నిషేధించారు. అయితే.. ఇల్లంతా పూర్తయి ఈ నెల ఏప్రిల్ 10న గృహప్రవేశం చేసిన రోజున మాత్రం ఒక గుర్తు తెలియని మహిళ ప్రవేశించి చంద్రబాబు - ఆయన సతీమణిలను పూర్తిగా అనుసరించినట్లు పోలీసు వర్గాల నుంచి తెలుస్తోంది.
    
చంద్రబాబు ఇంట్లోకి ప్రవేశించిన ఆమె తన సెల్‌ ఫోన్‌ లో ఫోటోలు తీసే ప్రయత్నం చేసిందని.. దాంతో అక్కడి సెక్యూరిటీ అధికారి ఒకరు ఆ మహిళను తమ ఆధీనంలోకి తీసుకుని విచారించగా తాను చంద్రబాబు కోడలు బ్రాహ్మణి స్నేహితురాలినని, ఆమె ఆహ్వానం మేరకే వచ్చానని చెప్పిందని సమాచారం.  అయినా వారు నమ్మకుండా వెంటనే స్థానిక పోలీసుల సహాయంతో విచారించగా షాకింగ్ న్యూస్ బయటపడినట్లు తెలుస్తోంది. ఆమెకు  మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, చంద్రబాబు కదలికలపై ఆరా తీసేందుకే ఆమె వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. పైగా చంద్రబాబు కోడలు బ్రాహ్మణితో ఈ అంశాన్ని ప్రస్తావించగా తన స్నేహితులు ఎవరినీ గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆహ్వానించలేదని చెప్పారట.
    
మరోవైపు సీసీ కెమేరాల ఫుటేజిని పోలీసులు చూడగా గృహప్రవేశానికి రెండు రోజుల ముందునుంచే ఆమె ఆ ప్రాంతంలో తిరిగినట్లు ఆధారాలు దొరికాయట.   ఈ విషయం బయటకు పొక్కకుండా అటు చంద్రబాబు భద్రతా సిబ్బంది - ఇటు తెలంగాణ పోలీసులు జాగ్రత్త పడ్డారు. గృహ ప్రవేశం తర్వాత సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేసిన చంద్రబాబు ఇంటి ఫోటోలు సదరు మహిళ వాట్సప్‌ ద్వారా పంపించినవేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న మహిళను ఇంకా విచారిస్తూనే ఉన్నారని ఆమె ఎవరన్నది నిర్ధారణ అయ్యాక పోలీసులు మీడియా ముందు ఆమెను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Maoists 
  • Chandrababu naidu 
  • New House 
  • Hyderabad 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS