ఓ డాక్టర్ ఆవేదన: 'ఇదే నా చివరి గుడ్ మార్నింగ్ కావొచ్చు'
కొవిడ్ రక్కసి దేశవ్యాప్తంగా తన విశ్వరూపం చూపిస్తోంది. ఒక్క సారిగా దేశం కరోనా రెండో దశ గుప్పిట్లో చిక్కి విలవిలల్లాడుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దాదాపు అన్ని ఆస్పత్రులు కరోనా బాధితులతో కిటకిటలాడుతున్నాయి. ఎంతోమంది వైద్య నిపుణులు ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్నారు. వారిలో కొందరు మహమ్మారి కాటుకు బలవుతున్నారు.
ముంబయిలోని స్వెరి టీబీ ఆస్పత్రిలో క్షయ నిపుణురాలైన సీనియర్ మెడికల్ ఆఫీసర్ గా పని చేసే వైద్యురాలు మనీషా జాదవ్ ని కరోనా పొట్టనబెట్టుకుంది. కొవిడ్ సోకి ఆమె ప్రాణాలు కోల్పోయారు. వైద్యురాలైన మనీషా తన మరణాన్ని ముందుగానే అంచనా వేశారు. అందుకే ఆమె మృతిచెందడానికి 36 గంటల ముందు ఓ వీడియో సందేశాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. ఆ వీడియో నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది.
'ఇదే నా చివరి గుడ్ మార్నింగ్ కావొచ్చు. ఈ వేదికపై ఇకపై మిమ్మల్ని కలిసే అవకాశం రాకపోవచ్చు. కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. అందరూ జాగ్రత్తగా ఉండాలి. మరణం శరీరానికే కానీ... ఆత్మకు కాదు' అంటూ ఫేస్ బుక్ లో ఓ వీడియోను ఆదివారం పోస్ట్ చేశారు. ఆ వీడియో వైరల్ గా మారింది. 36 గంటల అనంతరం ఆమె ప్రాణాలు కోల్పోయారు.
ఇప్పటికే ఎంతో మంది వైద్యులు, ఆరోగ్య నిపుణులు సామాజిక మాధ్యమాల వేదికగా హెచ్చరిస్తున్నారు. ముంబయికి చెందిన ఫిజిషియన్ తృప్తి గిల్డా కరోనా విషాద ఘటనలను తెలుపుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆస్పత్రుల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయని.. తామంతా నిస్సహాయులుగా మారిపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
కరోనా కాటుతో మహారాష్ట్రలో ఇప్పటివరకు మొత్తం 18వేల మంది వైద్యులు కొవిడ్ బారిన పడ్డారని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. 168 మంది మృతిచెందారని వెల్లడించింది.