వైట్ హౌస్ ను తాత్కాలికంగా మూసేశారు

Update: 2017-03-28 18:01 GMT
అవును.. నిజమే.. ప్రపంచానికే పెద్దన్న లాంటి అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ ను తాత్కాలికంగా మూసేశారు. ఒక అనుమానిత బ్యాగు రేపిన కలకలంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. వైట్ హౌస్ దక్షిణం వైపున్న ప్రాంతంలో ఒక అనుమానిత బ్యాగ్ ను గుర్తించిన సిబ్బంది..వెంటనే సీక్రెట్ సర్వీస్ అధికారులకువిషయాన్ని తెలియజేశారు.వెనువెంటనే రంగంలోకి దిగిన వారు.. అనుమానిత బ్యాగ్ ను స్వాధీనం చేసుకోవటంతో పాటు.. వైట్ హౌస్ లోని ప్రతి అణువునూ శోధిస్తున్నారు.

ఇటీవల బ్రిటన్ పార్లమెంట్ ను లక్ష్యంగా చేసుకొని దాడికి యత్నించిన నేపథ్యంలో.. ఏమైనా జరగొచ్చన్న అనుమానంతో.. సోదాలు నిర్వహిస్తున్నారు. గుర్తు తెలయని వారు ఎవరైనా వైట్ హౌస్ లోకి చొరబడి ఉంటారన్నసందేహాలువ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తనిఖీలు నిర్వహించేంత వరకూ ముందస్తు జాగ్రత్తగా వైట్ హౌస్ ను తాత్కాలికంగా మూసేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం బయటకు రావాల్సి ఉంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News