• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ప్రియురాలి కోసం చస్తా.....

ప్రియురాలి కోసం చస్తా.. ప్రియుడి ఆవేదన

By - Tupaki Desk
Update: 2019-06-10 08:20 GMT
సినిమాల్లో అంతే.. నిజ జీవితంలో అంతే.. అందమైన ప్రేమ కథలో అమ్మాయి తండ్రులే విలన్లుగా మారిపోతుంటారు. ఇప్పుడు హైదరాబాద్ లో జరిగిన ఈ ప్రేమ కథలోనూ అమ్మాయి తండ్రే అడ్డుగా నిలిచాడు.. కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందని ఆమెను కిడ్నాప్ చేసి ప్రియుడిని పోలీసుల సాయంతో ముప్పు తిప్పలు పెడుతున్నాడు. అష్ట కష్టాలు పడుతున్న ఆ ప్రియుడు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి తన బాధను వెళ్లగక్కాడు. తన ప్రియురాలిని అప్పగించకపోతే చావే శరణ్యమంటున్నాడు.

విశాఖకు చెందిన పొన్నాన ప్రభాస్ హైదరాబాద్ కూకట్ పల్లిలో బీఎఫ్ ఏ చదువుతున్నాడు. డిసెంబర్ లో అదే ప్రాంతంలోని లోధా అపార్ట్ మెంట్ లో ఉంటున్న తన్వి అనే యువతితో ప్రభాస్ కు పరిచయం ప్రేమగా మారింది. తల్లిదండ్రులను కాదని తన్వి-ప్రభాస్ లు ఫిబ్రవరి 15న శ్రీనగర్ కాలనీలోని సాయిబాబా దేవాలయంలో స్నేహితుల సాయంతో పెళ్లి చేసుకున్నారు.

కూతురు పెళ్లి చేసుకుందని అమ్మాయి తల్లిదండ్రులు కక్ష పెంచుకున్నారు. కూతురుతో మంచి గా మాట్లాడి వారు ఉంటున్న అపార్ట్ మెంట్ లోకి మారేలా చేశారు. చివరకు నమ్మించి తన్విని నిర్భందించి పెళ్లి సాక్ష్యాలను మాయం చేసి ప్రభాస్ ను పోలీసులకు అప్పగించారు. పోలీస్ స్టేషన్ లోనే ప్రభాస్ ను తన్వి తండ్రి - ఆయన సన్నిహితులు చితకబాదారు. పోలీసులు కూడా తన్వి తండ్రికి సపోర్టుగా ప్రభాస్ ను హింసించారు. ప్రభాస్ తల్లిదండ్రులకు విషయం తెలిసినా వారు పట్టించుకోలేదు.

ఇలా భార్య పోయి.. కన్న వారు కాదని ప్రభాస్ ప్రస్తుతం మీడియాకు ఎక్కాడు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తన ఆవేదనను మీడియాకు తెలిపాడు. తనకు న్యాయం చేయాలని హోంమంత్రిని - కమిషనర్ ను కోరుతున్నాడు. ఈ ప్రియుడి విరహ వేదనను పోలీసులు అర్థం చేసుకుంటారా.,? లేక కాలదన్నుతారా అనేది వేచిచూడాల్సిందే..


Tags:    
  • Man 
  • Life Threats 
  • Wife 
  • Hyderabad 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS