మహారాజ్ కేసు: ఆనంద్ గిరి అరెస్ట్...సీబీఐకి అఖాడా పరిషత్ డిమాండ్
అఖిల భారతీయ అఖండ పరిషత్ అధ్యక్షులు మహంత్ నరేంద్ర గిరి మహారాజ్ కన్నుమూశారు. ఉత్తర ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో గల తన నివాసంలో విగతజీవిగా మారారు. మహారాజ్ మృతిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 8 పేజీల సూసైడ్ నోట్ రాసి.. ఆశ్రమం తదనంతరం ఎవరూ చూసుకునే అంశాన్ని ప్రస్తావించారు. శిష్యుడు ఆనంద్ గిరీ పేరు ఉందని పోలీసులు తెలిపారు. కానీ ఆయన తన పేరుతో కొందరు కుట్ర చేస్తున్నారని ఆనంద్ ఆరోపించారు. భూ మాఫియా పేరును ప్రస్తావించారు. ఉత్తర ప్రదేశ్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ సమయంలో మహారాజ్ హఠాన్మరణం కాషాయ దళానికి ఇబ్బంది కలిగించేది.మహారాజ్ తన గదిలో ఉరి వేసుకొని చనిపోయారు. నైలాన్ తాడుతో ఉరి వేసుకున్నారని.. డోర్ తగులగొట్టేసరికి అచేతనంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
అయితే మహారాజ్ మానసికంగా ఆందోళనకు గురయ్యారని తెలుస్తోంది. సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు చెబుతున్నారు. మహారాజ్ రాసిన సూసైడ్ నోట్ లో ఆశ్రమానికి సంబంధించి వ్యవహారాలను ఎవరు చూసుకోవాలనే అంశానికి సంబంధించి వీలునామా కూడా రాశారు. అందులో ఆనంద్ గిరి పేరు ఉంది. ఇతర శిష్యుల పేర్లను కూడా మహారాజ్ ప్రస్తావించారు. ఆనంద్ గిరి పేరు తెరపైకి రావడంతో ఏం జరిగిందనే అంశం చర్చకు వచ్చింది. ఆశ్రమ ఆస్తి కోసమే ఆనంద్ ఏమైనా చేశారా అనే సందేహాలు వస్తున్నాయి. దీంతో ఆయన అలర్ట్ అయ్యారు. మహారాజ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని అంటున్నారు. ఇందులో ఏదో పెద్ద కుట్ర ఉంది అని ఆరోపించారు. అందుకే తెరపైకి తన పేరు తీసుకొచ్చారని ఆరోపించారు.
దీనికి సంబంధించి నిష్పక్షపాత దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని స్పష్టంచేశారు. తప్పు చేశానని రుజువు అయితే.. ఎలాంటి శిక్ష అనుభవించడానికి అయినా సిద్దం అని చెప్పారు. 15 రోజుల క్రితమే గురుజీతో తాను మాట్లాడానని వివరించారు. గురుజీ హత్యతో ల్యాండ్ మాఫియాకు లింక్ ఉందని ఆరోపించారు. నగదు కోసం కొందరు వేధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.అలాగే ఐజీ కేపీ సింగ్ పై కూడా ఆనంద్ గిరి ఆరోపణలు చేశారు. అతనిపై విచారణ జరపాలని కోరడం చర్చానీయాంశం అయ్యింది.
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ ప్రధాన కేంద్రంగా దేశవ్యాప్తంగా ధార్మిక సేవలను కొనసాగిస్తోన్న ఈ అఖాడా పరిషత్ కు నేతృత్వం వహిస్తోన్న మహంత్ నరేంద్ర గిరి మహారాజ్ బలవన్మరణానికి పాల్పడటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. ఆయన డెత్ కేస్‌ను సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ పెరుగుతోంది. మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకునేంతటి పిరికివాడు కాదని, దీని వెనుక కుట్ర ఉందంటూ అఖాడా పరిషత్ ఉపాధ్యక్షుడు దేవేంద్ర సింగ్ అన్నారు. ఆయన ఆత్మహత్య ఉదంతంపై సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన బాధ్యత యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉందని అన్నారు. ఆయన డెత్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
నరేంద్ర గిరి డెత్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఇతర హిందూ ధార్మిక సంఘాలతో కలిసి త్వరలోనే ప్రభుత్వ పెద్దలను కలుస్తామని ఆయన చెప్పారు. నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకునేలా పరిస్థితులు ఉద్దేశపూరకంగా సృష్టించి ఉంటారని, ఆయనపై మానసిక ఒత్తిళ్లను తీసుకుని ఉంటారనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. నరేంద్ర గిరి మానసికంగా ఆందోళనకు గురయ్యారనే విషయాన్ని ఆత్మహత్య లేఖ స్పష్టం చేస్తోందని దేవేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఆయన మరణంపై సమగ్ర దర్యాప్తును జరిపించాలని, ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిష్పక్షపాతంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అది సీబీఐకి మాత్రమే సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. మహారాజ్ మృతిపై ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. సంత్ సమాజం అనుసంధానించడం కోసం ఆయన ఎనలేని కృషి చేశారని అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.