బాబోయ్.. కూతురు పెళ్ళికి కానుకలు లారీల కొద్దీ.. చూస్తే షాకే

Update: 2020-11-09 11:10 GMT
తమిళనాడుకు చెందిన ఓ రాజకీయనేత తన కూతురు పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలనుకున్నాడు. పెళ్లి సందర్భంగా కూతురు కాపురానికి కావాల్సిన వస్తువులన్నీ ఇవ్వడం హిందూ సంప్రదాయంలో ఆచారంగా వస్తున్నది. ఇదే ఆచారాన్ని కొనసాగించాడు ఈ మాజీ ఎమ్మెల్యే. ఇక కూతురు తాను ఇచ్చిన వస్తువులు లిస్ట్​ చెబితే ఓ పుస్తకం అవుతుంది. లారీల  కొద్ది సామగ్రిని పంపించాడు. ఫంక్షన్ ​హాల్​ లో ఆ వస్తువులను పెడితే హాల్​ అంతా నిండి పోయింది. ఆ సామాన్లను మోసుకెళ్లడానికే ఓ రెండు వందల మందికి పైగా కావాల్సి వచ్చిందంటే ఎన్ని సామాన్లు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కూతురు పెళ్లి సందర్భంగా  తమ ఆచారం ప్రకారం.. కూతురుకు పెళ్లి కానుకగా రెండు కిలోల బంగారు ఆభరణాలు, కిలోలకొద్ది వెండి సామగ్రి, రెండు బైక్​లు, ఓ ఖరీదైన కారు, వ్యవసాయం చేసుకోవడానికి సరిపోయిన ఎద్దులు, ట్రాక్టర్​, మేకలు, గొర్రెలు, పశుసంపద, ఓ యాబై బియ్యం బస్తాలు,  ఇదీ అదీ అని లేకుండా ఇంటికి సంబంధించిన వంట సామగ్రి, వస్తువులు అన్ని ఇచ్చాడు. ఈ కానుకలు చూసి అందరూ నోరెళ్లబెడుతున్నారు.

 తమిళనాడులో తమిళ అరసన్‌ అన్నాడీఎంకే పార్టీకి చెందిన ముఖ్య నేత. ఒకప్పుడు ఎమ్మెల్యేగా పదవిలోనూ ఉన్నారు. మదురై జిల్లా మేళూరుకు చెందిన ఈయనకు కూతురు ఆర్తి పెళ్లి చాలా గ్రాండ్‌గా చేయాలనే తలంపు పుట్టింది. అదే ప్రాంతానికి చెందిన వెట్రివేల్‌కు ఇచ్చి ఈ నెల నాలుగో తేదీన వైభవంగా వివాహం జరిపించాడు.  కరోనా సమయంలో జనం ఉపాధి లేకుండా అవస్థలు పడుతుంటే ఇంత గ్రాండ్‌గా పెళ్లి చేయడం అవసరమా అని అంటున్నారు కొందరు. పెళ్లిలో కరోనా నిబంధనలు అసలు పాటించనే లేదు! ఎవరూ మాస్కులు పెట్టుకో లేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.
Tags:    

Similar News