• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మూడు రాజధానుల పై...

మూడు రాజధానుల పై జయప్రకాష్ స్పందన ?

By - Tupaki Desk
Update: 2019-12-18 05:59 GMT
అధికార వికేంద్రీకరణ జరగాలనే ఒక గొప్ప లక్ష్యం తో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మూడు రాజధాని నగరాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు మంగళవారం  అసెంబ్లీలో చేసిన ప్రకటన పట్ల లోక్ సత్తా పార్టీ అధినేత  మాజీ ఎమ్మెల్యే జయప్రకాశ్ నారాయణ్ తన స్పందన తెలియజేసారు. వైఎస్ జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా జయప్రకాశ్ నారాయణ్ ఓ ప్రకటన చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అధికారాన్ని వికేంద్రీకరించాలనే నిర్ణయాన్ని తప్పు పట్టలేమని ఆయన తన అభిప్రాయాన్ని తెలియ జేసారు.

అధికార వికేంద్రీకరణ జరగాలనే విషయాన్ని తాము ముందు నుంచీ చెబుతూనే వస్తున్నామని అన్నారు. ఒకే చోట, ఒకే ప్రాంతంలో అధికారాన్ని గానీ, అభివృద్ధిని గానీ కుప్పగా పోయడం వల్ల ఎలాంటి సత్ఫలితాలు రావని చెప్పారు. అధికార వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ తప్పనిసరిగా జరిగి తీరాల్సిన అవసరం ఏ రాష్ట్రానికైనా అవసరం అవుతుందని అన్నారు. లోక్ సత్తా ప్రధాన లక్ష్యం, ముఖ్య ఉద్దేశం అదేననే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో ఉండటం వల్ల ఆ ప్రాంత ప్రజలు మాత్రమే అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని, వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాలు పురోగమించవని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమంగా అభివృద్ధి చెందాడానికి అధికార వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ వల్లే సాధ్యమని అలాంటి నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకోవడం స్వాగతించాల్సిన విషయమని అన్నారు.

అమరావతి ని కేంద్ర బిందువుగా చేసుకుని..మూడు రాజధానుల పరిపాలనా వ్యవహారాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించాలని జయప్రకాశ్ నారాయణ్ సూచించారు. ఈ నిర్ణయాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఏపీ ప్రభుత్వం పై ఉందని అన్నారు. అలాగే తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ వంటి నాయకులు మూడు రాజధాని నగరాల నిర్ణయాన్ని స్వాగతించారు.
Tags:    
  • Amaravathi 
  • Amaravathi News 
  • Andhra News 
  • Amaravathi Startup Developement Area 
  • Ys Jagan 
  • Andhra Politics 
  • Tupaki News 
  • Tupaki Updates 
  • Botsa Satyanarayana 

Similar News

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

ఛాతీ ఎముక కోయకుండానే బైపాస్ సర్జరీ.. భారతీయ రోబోతో అరుదైన ఆపరేషన్!

2026-11-19 05:32 GMT

H-1B స్లాట్ల కోసం రోజూ ఎదురుచూపులు.. బుక్ చేసేలోపే మాయం!

2026-11-19 05:09 GMT

మరో 15 నెలల్లో AI మనుషులను మించిపోతుందా? ఉద్యోగాలు ఏమవుతాయోనని భయం!

2026-11-19 05:08 GMT

GTA 6 కోసం నాలుగు రోజులు సెలవు.. అమెరికా సైనికులకు అదిరిపోయే ఆఫర్!

2026-11-19 05:08 GMT

GTA 6 తయారీలో బెంగళూరు టీమ్.. 1,600 మందికి పైగా భారతీయుల పని!

2026-11-19 05:08 GMT

Copyright @2026

Powered by Blink CMS