• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  లాక్ డౌన్ ఎఫెక్ట్ .....

లాక్ డౌన్ ఎఫెక్ట్ .. కిక్కిరిసిన మార్కెట్లు

By - Tupaki Desk
Update: 2021-04-20 05:30 GMT
కరోనా సెకండ్ వేవ్ దేశంలో అలజడి రేపుతోంది. మళ్లీ మునుపటి కంటే ఎక్కువగా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ , వీకెండ్ లాక్ డౌన్, కర్ఫ్యూ  వైపు అడుగులు వేస్తున్నాయి. ఇక కొరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వం ఆరు రోజులు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీనితో  ప్రజలు పెద్ద ఎత్తున నిత్యావసరాల కొనుగోళ్లకు దిగారు.  పలు ప్రాంతాల్లో మార్కెట్లు, మద్యం దుకాణాలు, మాల్స్‌ వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. లాక్ ‌డౌన్‌ వేళ బయటకు రాకుండా ఉండాలంటే ఇంట్లో అన్నీ సిద్దంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రజలు షాపింగ్ ‌కు ఒక్కసారిగా బయటకి వచ్చారు. ఈనెల 26 సాయంత్రం 5గంటల వరకు లాక్ ‌డౌన్‌ ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

దీనితో  ఎలాగైనా కొన్ని సరుకులు కొందామని భావిస్తున్న సామాన్య ప్రజలు ఈ ప్రకటనతో ఒక్కమారుగా పెద్ద ఎత్తున సరుకుల కొనుగోళ్లకు దిగారు. ఏడాది దాటిపోతున్నా కూడా కరోనా లో ఏ మాత్రం మార్పు రాలేదని, ఎమర్జెన్సీ వేళల్లో ప్రభుత్వాన్ని నమ్మలేమని, అందుకే సంసిద్ధంగా ఉండేందుకు నిత్యావసరాలను కొనుగోలు చేస్తున్నామని ప్రజలు చెప్తున్నారు. ప్రజల్లో లాక్ ‌డౌన్‌ ప్రకటన కారణంగా భయాందోళన నెలకొందని, అందుకే ఇలా మూకుమ్మడి కొనుగోళ్లకు దిగారని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రజల్లో నెలకొన్న భీతిని క్యాష్‌ చేసుకునేందుకు కొందరు వ్యాపారస్తులు యత్నిస్తున్నారని ప్రజలు ఆరోపించారు. చాలా షాపుల్లో వస్తువుల ధరలు ఒక్కసారిగా పెంచేశారని మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇలాంటి వారిని అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ లాక్ ‌డౌన్‌ పొడిగిస్తే మధ్యతరగతి పరిస్థితి దారుణంగా తయారవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. డీడీఎంఏ ఆదేశాల ప్రకారం లాక్‌ డౌన్‌ సమయంలో అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి. మాల్స్, జిమ్స్, ఉత్పత్తి యూనిట్లు, విద్యాసంస్థలు, సినిమాహాల్స్, రెస్టారెంట్లు, బార్లు, పబ్లిక్‌పార్కులు, స్పా మరియు బార్బర్‌ షాపులు మూసేయాలి.
Tags:    
  • delhi lockdown 
  • Covid 19 
  • Corona cases 
  • latest covid 19 cases 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS