• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఎస్సీ - ఎస్టీల అసైన్డ్‌...

ఎస్సీ - ఎస్టీల అసైన్డ్‌ భూములు కాజేసిన టీడీపీ నేతలు !

By - Tupaki Desk
Update: 2020-01-01 07:45 GMT
రాష్ట్రంలో మూడు రాజధానుల పై జరిగే రచ్చలో రాజధాని రైతులకి మద్దతుగా నిలుస్తూ ఏపీ సర్కార్ పై ఊగిపోతున్న టీడీపీ నేతల అసలు బండారం తాజాగా వెలుగులోకి వచ్చింది. కళ్లు మూసుకొని పాలు తాగే పిల్లి కూడా తనని ఎవరు చూడలేదు అని అనుకుంటుంది. కానీ , కళ్లు ఉండేది ఒక్క పిల్లికి మాత్రమే కాదు అన్న విషయం మరచి ఆలా ప్రవర్తిస్తుంటుంది. ఇప్పుడు టీడీపీ నేతలు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అప్పట్లో రాజధాని రైతులకి చేయాల్సిన అన్యాయం అంతా చేసి ..ఇప్పుడు పబ్బం గడుపుకోవడానికి రైతులతో కలిసి ప్రభుత్వం పై పోరాటం అంటూ కొత్త నాటకానికి తెరతీసింది.

అసలు విషయం ఏమిటంటే ... రాజధాని భూములపై జరిగిన స్కామ్ గురించి జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌ కమిటీ చంద్రబాబు హయాంలో కేటాయించిన భూములపై ఒక నివేదికను గతేడాది డిసెంబర్ 27న ప్రభుత్వానికి సమర్పించింది. మాములుగా అయితే అసైన్డ్ భూములను ప్రభుత్వం ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ లకు , పేదలకు, భూమి లేని వారికి కేటాయిస్తుంది. ఈ భూములను ఇతరులు కొనరాదు, అలాగే వీటిని ఎవరూ అమ్మరాదు. అయితే , కేబినెట్ సబ్‌కమిటీ సమర్పించిన నివేదికలో అమరావతిలో 30 మంది రియల్టర్లు, ఇతర టీడీపీ నేతలు 444.66 ఎకరాల అసైన్డ్ భూములను ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారి నుంచి కొనుగోలు చేసినట్లు రిపోర్ట్ వెల్లడించింది.

ఏపీ అసైన్డ్ భూముల చట్టం 1977 ప్రకారం, అసైన్డ్ భూములను కొనుగోలు కానీ ఇతరులకు బదిలీ కానీ చేయకూడదు. అయితే ఇక్కడ కొందరు ప్రభావితం చేయగల రియల్టర్లు రాజకీయనాయకుల అండ చూసుకుని దళితులకు గిరిజనులకు కేటాయించిన భూమిని అమ్మాల్సిందిగా వారి పై ఒత్తిడి తీసుకొచ్చినట్లు కేబినెట్ సబ్ కమిటీ తెలిపింది. అసైన్డ్ భూములు కలిగి ఉన్న దళితులు, గిరిజనుల వద్దకు వెళ్లి వారికున్న భూములు ల్యాండ్ పూలింగ్ కింద గుర్తించబడలేదని, దీంతో ఎలాంటి లబ్ధి ప్రభుత్వం నుంచి చేకూరదని మోసపూరితమైన మాటలు చెప్పి వారి వద్ద నుంచి బలవంతంగా భూములను కొనుగోలు చేసినట్లు రిపోర్ట్ లో తెలిపింది.

అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన తర్వాత రియల్టర్లు, కొందరు టీడీపీ నేతలు అసైన్డ్ భూములను కూడా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కిందకు చేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఇలా చేస్తే ఆ కొన్న ఆ అసైన్డ్ భూములకు ప్రభుత్వం తరుపున రావాల్సిన అన్ని లబ్ధిలు చేకూరడంతో పాటు అభివృద్ధి చేసి ఇచ్చే ప్లాట్లు వస్తాయని భావించారు. వీరి ఒత్తిడి తో అప్పటి చంద్రబాబు సర్కార్ 2014 డిసెంబర్ 14న అసైన్డ్ భూములు ల్యాండ్ పూలింగ్ స్కామ్ కిందకు వస్తాయంటూ జీవో విడుదల చేశారు. ఇదిలా ఉంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారి సొంత పేరు తో భూములు కొనుగోలు చేయగా టీడీపీ నేతలు మాత్రం బినామీ పేరుతో భూములు కొనుగోలు చేసినట్లు నివేదిక వెల్లడించింది. ఇందులోను కొన్ని అవకతవకలను కేబినెట్ సబ్ కమిటీ గుర్తించింది.


Tags:    
  • Amaravathi 
  • Amaravathi News 
  • Andhra News 
  • Andhra Politics 
  • Andhra Daily News 
  • Telugu News 
  • Did Chiru Made A Blunder 3 Capitals 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS