• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  సీసీ ఫుటేజ్: పట్టపగలు...

సీసీ ఫుటేజ్: పట్టపగలు నడిరోడ్డు మీద హత్య!

By - Tupaki Desk
Update: 2016-11-04 10:05 GMT
మానవత్వం మచ్చుకైనా కనిపించని సంఘటనా లేక మానవత్వపు ఛాయలు కనిపించని చోట జరిగిన ఘటనా అనే అనుమానం కలిగేలా జరిగింది ఒక సంఘటన! వెంటనే విషయానికొచ్చేస్తే... 49 ఏళ్ల వెజానంద్ ఓజాహియా - అతడి కొడుకు కలిసి అబాబాయ్ అమలియా (27) ఏళ్ల వ్యక్తిని అత్యంత దారుణంగా పొడిచి చంపేశారు. పట్టపగలు - నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ సంఘటన జరిగింది. ముందుగా గొడవకు దిగిన వెజానంద్ - అమలియాపై విరుచుకుపడ్డాడు. అనంతరం అతడిపై పిడిగుద్దులు గుద్దుతూ, రాళ్లతో దాడి చేశాడు. అక్కడికీ ఆవేశం చల్లారలేదో ఏమో కానీ... కత్తులతో వీరంగం చేశాడు. దీంతో దాడికి గురైన అమలియా అక్కడికక్కడే కుప్పకూలిపడిపోయాడు.

ఈ దాడి జరగడం ఒకెత్తు అయితే... ఈ దాడి అనంతరం సుమారు 2 గంటలపాటు బాధితుడు రక్తంమడుగులో గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదలడం మరొకెత్తు. ఆ సమయంలో ప్రాణాప్రాయం స్థితిలోవున్న ఆ వ్యక్తిని - ఆ తతంగాన్నంతా టీవీ చూసినట్టు చూశారు తప్ప కాపాడేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. గుజరాత్‌ లో పట్టపగలే ఈ దారుణం జరిగింది. గోకుల్ నగర్‌ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి దృశ్యాలన్నీ సీసీకెమెరాలో రికార్డయ్యాయి. దీంతో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధం వల్లే అమలియాను అత్యంత దారుణంగా చంపేశారని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారట.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Murder 
  • Crowded street 
  • Gujarati 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS