• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జనసేన మీటింగ్ ... రాపాక...

జనసేన మీటింగ్ ... రాపాక అలా హైలెట్... ?

By - Tupaki Desk
Update: 2022-03-14 10:30 GMT
జనసేనకు ఏపీలో బరువు మిగిల్చిన ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ ని జన సైనికులు ఎపుడూ గుర్తు చేసుకుని బాధపడతారు. ఏపీలో జనసేన పరువు నిలిపిన నేత అని మూడేళ్ళ క్రితం అనుకున్నా ఆ ముచ్చట మూణ్ణాళ్ళతోనే పోయింది. ఆయన వెళ్ళి తొలి బడ్జెట్ సెషన్ లోనే వైసీపీకి అండగా ఉంటామని చెప్పి పార్టీ జెండాకు పాతరేశారు. దాంతో జనసేనకు ఆయనకు మధ్య అలా దూరం పెరిగింది.

ఇక ఇపుడు ఆయన్ని  వైసీపీ ఎమ్మెల్యేగానే చూస్తున్నారు. అయితే ఆయన్ని తలచుకోవడం మాత్రం జనసైనికులు మానడంలేదు. తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం వద్ద జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభ వద్ద జనసేన నాయకుల పెద్ద పెద్ద కటౌట్లు కనిపిస్తున్నాయి. ఇక ఎటు చూసినా పవన్ కళ్యాణ్ కటౌట్లకు కొరత లేనే లేదు.

అయితే వాటి మధ్యన ఒక పోస్టర్ కూడా ఇపుడు హైలెట్ అవుతోంది. అదే జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ది. ఆయనకు జనసేన సభకు నో ఎంట్రీ అని జనసైనికులు ఫోటో పెట్టి మరీ చెప్పేశారు. బహిరంగ సభకు రాపాకు ప్రవేశం లేదు అని కూడా పక్కా క్లారిటీగా చెప్పేశారు.  ఇట్లు మీ పల్లకీ మోసిన జనసైనికులు అని కూడా రాపాక  ఫోటో కింద రాశారు.

దాంతో వారి బాధ ఆవేదన ఏంటి అన్నది అర్ధమవుతోంది. తాము కష్టపడి ఎమ్మెల్యేను గెలిపిస్తే ఆయన వెళ్ళి వెళ్ళి ప్రత్యర్ధి పార్టీ పల్లకీ మోస్తున్నారు అని జనసైనికుల ఆగ్రహంగా ఉంది. దాన్ని వారు ఇప్పటం సభ వద్ద పోస్టర్ పెట్టి మరీ ప్రదర్శించడం ద్వారా జనసేన ఫైర్ ఏంటో చెప్పేశారు.

తాము మెచ్చుకుని గెలిపిస్తే అందలాలు ఎక్కిస్తాం, కాదని వెళ్తే ఇలా మర్యాదలు కూడా చేస్తామని చెప్పడమే ఈ రాపాక ఫోటోతో కూడిన పోస్టర్ అని అంటున్నారు. మొత్తానికి రాపాక ఈ సభకు రారు, రాలేరు, ఆయన సైతం వైసీపీతో మానసికంగా కలసి ట్రావెల్ చేస్తున్న సందర్భం.  

అయినా కూడా జనసైనికులు మాత్రం ఆయన మీద సెటైరికల్ గా ఇలా రివేంజ్ తీర్చుకుంటున్నారు అనే అంటున్నారు.
Tags:    
  • Janasena 
  • Pawankalyan 
  • Razole 
  • Mla 
  • Rapaka Varaprasad 
  • Chalo Amaravathi 
  • Latestnews 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS