• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భార్య మటన్ వండలేదని...

భార్య మటన్ వండలేదని పోలీసులకు ఫోన్..

By - Tupaki Desk
Update: 2022-03-21 07:31 GMT
హోలీ పూట భార్య మటన్ వండలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడో భర్త. నల్గొండ జిల్లాలో జరిగిన ఈ వింత ఘటన వైరల్ అయ్యింది. భార్య మటన్ వండమంటే నిరాకరించిందనే కోపంతో ఓ భర్త ఊగిపోయాడు. ఆవేశానికి గురయ్యాడు. వెంటనే జేబులో ఉన్న ఫోన్ తీసి డయల్ 100కు కాల్ చేశాడు. అతడి ఫిర్యాదు విన్న పోలీసులు సీరియస్ అయ్యారు.

నల్గొండ జిల్లా కనగల్ మండలం చెర్ల గౌరారం గ్రామానికి చెందిన నవీన్ హోలీ రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యను మటన్ వండాలని కోరాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న నవీన్ ఊగిపోయాడు. అవమానంగా ఫీల్ అయ్యాడు.

జేబులో ఉన్న ఫోన్ తీసి డయల్ 100కు ఫోన్ చేశాడు. ఫిర్యాదు చేశాడు. ఇది సిల్లీ విషయం అని మొదట పోలీసులు లైట్ తీసుకున్నారు.

కానీ నవీన్ వదలకుండా ఆరు సార్లు పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి విసిగించాడు. దీంతో నవీన్ కు బుద్దిచెప్పాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. పెట్రోలింగ్ పోలీసులు అతడి ఇంటికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న నవీన్ నుచూసి వెనుదిరిగారు.

మరుసటి రోజు నవీన్ ఇంటికి వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై కేసులు నమోదు చేశారు.

ఆపదలో, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునేందుకు ఉద్దేశించిన డయల్ 100 సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సంబంధం లేని విషయాలపై డయల్ 100కు ఫోన్ చేసి విలువైన సమాయాన్ని వృథా చేయవద్దని కోరుతున్నారు. చేస్తే కేసులు పెడుతామని హెచ్చరిస్తున్నారు.
Tags:    
  • Holi 
  • DrunkMan 
  • Police 
  • Wife 
  • CookingMutton 
  • Naveen 
  • PatrolingPolice 
  • Nalgonda 
  • Telangana 

Similar News

కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?

2026-11-20 08:29 GMT

వారసులకు అందలం.. జడ్పీ పీఠాలపై పరిటాల శ్రీరామ్, సిరిసహస్ర, డాటర్ ఆఫ్ చింతమనేని

2026-11-20 08:28 GMT

పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..

2026-11-20 08:23 GMT

అంతర్జాతీయ చర్చల్లో భారత్ ఎక్కడుంది? రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్

2026-11-20 07:39 GMT

ఒక్క రోజులోనే రూ.21 వేల కోట్ల బిజినెస్.. GTA 6 రేంజ్ మామూలుగా లేదుగా!

2026-11-20 07:39 GMT

పులివెందులలో పంచాయతీ సెగ : పెట్రోల్ బాంబులు, రాళ్ల దాడులతో దద్దరిల్లిన గ్రామాలు!

2026-11-20 07:39 GMT

పల్లె రాజకీయాలను శాసిస్తున్న ‘చాట్ జీపీటీ’.. ఇప్పుడంతా దీంతోనే..

2026-11-20 06:46 GMT

160 ఏళ్ల చరిత్ర.. దావూద్ నివసించిన భవనంలో అసలేం ఉంది? ఎందుకు కూల్చివేత ఆగింది?

2026-11-20 06:45 GMT

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

Copyright @2026

Powered by Blink CMS