కేటీఆర్ కు ఆ కుర్రాడు కావాలట

Update: 2021-01-24 17:30 GMT
సోషల్ మీడియా పుణ్యమా అని మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి రావటమే కాదు.. టాలెంట్ ఉన్న వారికి అవకాశాలు లభించేలా చేస్తుందని చెప్పాలి. అంతేకాదు.. ఎవరైనా కష్టాల్లో ఉంటే.. ప్రముఖుల వరకు విషయాన్ని తీసుకెళ్లటానికి సోషల్ మీడియా చేస్తున్న సాయం అంతా ఇంతా కాదు. తాజాగా.. ఒక చిన్న కుర్రాడి టాలెంట్ ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

చిట్టి వీడియోలో సదరు కుర్రాడు జిమ్నాస్టిక్ లో తనకున్న టాలెంట్ ను ప్రదర్శించాడు. మట్టిలో కుర్రాడు చేసిన విన్యాసాలు చూసినోళ్లు ఎవరైనా సరే.. వావ్ అనాల్సిందే. ఈ కుర్రాడి వీడియోను చూసిన తెలంగాణరాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ సైతం విస్మయానికి గురయ్యారు. ఎవరీ అబ్బాయి? అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయటమే కాదు.. ఆరా తీయటం కనిపిస్తుంది.

ఇతను తెలంగాణా? లేదంటే వేరే రాష్ట్రానికి చెందిన కుర్రాడా? అని ప్రశ్నించారు. ఈ కుర్రాడికి ఉన్న సూపర్ టాలెంట్ ను సపోర్టు చేయాలన్న అభిలాషను వ్యక్తం చేశారు. ఒలింపిక్ మెడలిస్ట్ తర్పీదులో ఉన్నారంటూ కితాబునిచ్చారు. కేటీఆర్ మనసు దోచేసిన ఈ చిన్న కుర్రాడి వివరాలు బయటకు రావాల్సి ఉంది. మొత్తంగా తనకున్న టాలెంట్ ను చిట్టి వీడియోలో ప్రదర్శించిన ఈ మట్టిలో మాణిక్యం అడ్రస్ లభిస్తే.. అతడి గీత మారిపోతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News