సొంతింటి ఓట్లు పడని వారు కూడా సీఎం అభ్యర్థులే
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై గులాబీ పార్టీ ఎదురుదాడి తీవ్రతరం చేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఓవైపు ప్రచారంలో బిజీబిజీగా గడిపేస్తూనే..మరోవైపు చేరికలను ప్రోత్సహిస్తోంది. తాజాగా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన హస్తం పార్టీ సహా బీజేపీపై మండిపడ్డారు.ఆర్యవైశ్య కమ్యూనిటీలోని పేదల కుటుంబాలకు టీఆర్ ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రకటించారు. ఒకరు కిరాయి కడతాం అంటారు..మరొకరు పెళ్లి కాని అబ్బాయిలకు పిల్లను వెతికి పెడతామంటారని మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ - బీజేపీలను విమర్శించారు.బీజేపీ హామీలు వింటుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదని అని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ నేతలకు సొంత ఇంటి ఓట్లు కూడా పడవని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో సొంత ఇంటి ఓట్లు పడనివారు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులేనని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డివి ఉత్తుత్తి మాటలని కేటీఆర్ మండిపడ్డారు. దక్షిణాదిలో ఉన్న ఆరు రాష్ట్రాల బడ్జెట్ కలిపినా కాంగ్రెస్ ఇచ్చే హామీలు నెరవేర్చలేరని కేటీఆర్ స్పష్టం చేశారు. ఓటర్ జాబితాలో పేర్లను తామెందుకు తొలగిస్తామని - ఓట్లెక్కువుంటే తమకే మెజారిటీ పెరుగుతది కదా అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజాకోర్టులోనే తేల్చుకుందామని ఎన్నికలకు పోతున్నట్లు చెప్పారు. తామంతా రాబోయే తరాల కోసం పనిచేస్తున్నామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నామన్నారు. గురుకుల విద్యాలయాల ద్వారా 3 లక్షల మంది పిల్లలకు ప్రపంచస్థాయి విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. చనిపోయిన వారి వేలిముద్రలతోటి కాళేశ్వరంపై కేసు వేశారని మండిపడ్డారు. ప్రజాకోర్టులోనే తేల్చుకుందామని ఎన్నికలకు పోతున్నామన్నారు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఢిల్లీకి గులాములుగా ఉందామా? అని కేటీఆర్ ప్రజలను ప్రశ్నించారు.